విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రస్తుతం ‘సన్నాఫ్ ఇండియా’ సినిమాతో బిజీగా ఉన్నారు. మాటల రచయిత డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘సన్నాఫ్ ఇండియా’ సినిమా దేశ భక్తి బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని, ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని కథాంశంతో తెరకెక్కుతోందట.
ఇక ఈ సినిమాలో మోహన్ బాబు పాత్రతో పాటుగా మరొక ముఖ్యమైన పాత్ర కూడా ఉందట. ఆ పాత్రకు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేశారని తెలుస్తోంది. రకుల్ కు దర్శకుడు కథను వినిపించగా రకుల్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని టాలీవుడ్ టాక్. ఈ సినిమా కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది.
రకుల్ కుటుంబ సమేతంగా హాలిడే కు వెళ్లి ఇటీవల హైదరాబాద్ తిరిగొచ్చింది. మరికొన్ని రోజుల్లో ‘సన్నాఫ్ ఇండియా’ షూటింగ్ లో జాయిన్ అవ్వబోతోంది రకుల్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ ను తిరుపతిలో పూర్తి చేసుకుంది చిత్ర యూనిట్. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఒక సాంగ్ ను కూడా చిత్రీకరించారు. ఇప్పుడు హైదరాబాద్ లోనే రెండో షెడ్యూల్ ను బుధవారం స్టార్ట్ చేశారు. హైదరాబాద్ లో ఒక భారీ సెట్ ను కూడా నిర్మించారు. సినిమాలోని ఎక్కువ శాతం షూటింగ్ ఈ సెట్ లోనే జరగబోతోంది.
ఈ షెడ్యూల్ లో మోహన్ బాబు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. త్వరలోనే మోహన్ బాబు, రకుల్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కించాడని ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు డైమండ్ రత్నబాబు. ఈ సినిమాకు స్వయంగా మోహన్ బాబునే స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ మధ్యన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలో ఒక మంచి పాత్ర చేశారు మోహన్ బాబు. ఆ పాత్రకు గాను ఆయన మంచి పేరు వచ్చిన విషయం మనకు తెలిసిందే.
Also Read ;- బికినీలో రకుల్.. సముద్రంలో 40 అడుగుల లోతులో..











