మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ నటిస్తున్న చిత్రం మోసగాళ్లు. ఈ చిత్రానికి హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ముంబైలో బయటపడిన ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా రూపొందుతోన్న భారీ యాక్షన్ మూవీ టీజర్ గ్లింప్స్ ను ఆమధ్య స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ రిలీజ్ చేశారు.
బన్నీతో ప్రమోషన్ స్టార్ట్ చేసిన మోసగాళ్లు ఆతర్వాత ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ బయటకు వచ్చింది. ఇంతకీ ఎప్పుడంటే.. మార్చి 11న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేసారని సమాచారం. ఈ హై బడ్జెట్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో విష్ణు సరసన రూహానీ శర్మ నటించింది. బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి పవర్ పుల్ పోలీస్ ఏసీపి కుమార్ పాత్ర పోషించారు.
ఈ సినిమాతో బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో నవదీప్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ మూవీని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సరైన సక్సస్ కోసం ఎదురు చూస్తున్న మంచు విష్ణుకు ఈ సినిమా అయినా విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.
Must Read ;- యంగ్ చెస్ ట్రైనర్ గా మోహన్ బాబు మనవరాలు రికార్డ్
https://www.youtube.com/watch?v=F8awPo7DiOA











