పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. వేణుశ్రీరామ్ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా సమ్మర్ కి వచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే.. ఈ క్రేజీ, భారీ మూవీ గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాగానే.. జెమిని టీవీ రంగంలోకి దిగి శాటిలైట్స్ రైట్స్ కోసం దిల్ రాజుతో సూచనప్రాయంగా ఒప్పందం కుదుర్చుకుందట.
అయితే… ఆతర్వాత ఏమైందో ఏమో కానీ.. ఆఖరి నిమిషంలో డీల్ నుంచి ఆ ఛానల్ తప్పుకుందట. అలా.. జెమిని టీవీ తప్పుకోవడంతో జీ టీవీ రంగంలోకి దిగిందట. వకీల్ సాబ్ రికార్డు స్థాయిలో శాటిలైట్ రైట్స్ దక్కించుకుందని సమాచారం.. దాదాపు రూ. 15 కోట్లకు ఈ డీల్ సెట్ అయ్యిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇక టీజర్ విషయానికి వస్తే.. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు.
ఇందులో పవన్ సరసన శృతిహాసన్ నటించింది. అంజలి, నివేథా థామస్, అనన్య కీలకపాత్రలు పోషించారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైఅంజలి రెక్టర్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించారు. ఏప్రిల్ 9న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. టీజర్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా ఎనౌన్స్ చేయనున్నారని సమాచారం.
Must Read ;- పవన్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ?