ఏమిటి సీఎంకు ఇద్దరు భార్యలు అనుకుంటున్నారా? అలాంటిదేం లేదండీ. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలో మహానాడు రోడ్డుపై ఓ మహిళ సీఎం రెండో భార్యనంటూ హల్ చల్ చేసింది. పోలీసులను, స్థానికులను కాసేపు పరుగులు పెట్టించింది. స్థానికులపై రాళ్లతో దాడికి దిగడంతో ఇక ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
మతిస్థిమితం లేదట
సీఎం క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో మతిస్థిమితం లేని ధనలక్ష్మి అనే మహిళ, సీఎం రెండో భార్యనంటూ హల్ చల్ చేయడం సంచలనంగా మారింది. భారీగా భద్రత ఉండే ప్రాంతం కావడంతో వెంటనే పోలీసులు అప్రమత్తం అయ్యారు. మహానాడు ప్రాంతంలోని వైసీపీ నాయకుని ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిలకలూరిపేటకు చెందిన ధనలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు కోసం ధనలక్ష్మిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఈ తరహా కేసులు కొత్త కాదు
సెలబ్రిటీల పేరు చెప్పి.. ‘నేను వారి జీవిత భాగస్వామిని’ అని నానా యాగీచేసే వారి కేసులు మన సమాజంలో కొత్త కాదు. కాకపోతే గతంలో ఇలాంటి కేసులు ఎక్కువగా సినీ సెలబ్రిటీలకు సంబంధించి వెలికి వచ్చేవి. ఎక్కువగా హీరోయిన్ల గురించి మాత్రమే ఇలాంటి పుకార్లు పుడుతుండేవి. గతంలో శ్రీదేవి, జయప్రద, జయసుధ లకు ‘భర్త నేనే’ అంటే వేర్వేరు వ్యక్తులు.. ఏకంగా పోలీసు కేసులు నమోదు చేసి మరీ.. వార్తల్లోకి ఎక్కిన సందర్భాలు అనేకం.
ఇటీవలి కాలంలో కూడా తాను అనేక మంది సినిమా హీరోయిన్లకి బాయ్ ఫ్రెండ్ అని, టాప్ హీరోలందరూ తన అవకాశాలు తన్నుకుపోయారని, పెద్దపెద్ద డైరక్టర్లు తనతో సినిమాలు ప్లాన్ చేసి.. తర్వాత హ్యాండ్ ఇచ్చారని సంచలన యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలనం కలిగించడానికి ప్రయత్నించిన గాలి బ్యాచ్ వ్యక్తులు కూడా ఉన్నారు.
అయితే తాజా ఉదాహరణలో సీఎం రెండో భార్యని అంటూ ఓ మహిళ క్లెయిం చేయడం అనేది.. కేవలం మతి స్థిమితం లేని మహిళ కావడం వల్లనే అని తెలుస్తోంది..
Must Read ;- సీఎం జగన్‌తో పీకే భేటీ: రాజకీయ వ్యూహాల కోసమేనా?