పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన శ్రుతిహాసన్ నటించనుందని గత కొంత కాలంగా వార్తలు వచ్చాయి. అయితే.. ఆమె పాత్ర నిడివి ఎంత అనేది మాత్రం చెప్పలేదు. ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కనిపిస్తుందని.. ఓ పాట ఉంటుందని.. పవన్, శ్రుతిహాసన్ పై ఎమోషనల్ సీన్స్ ఉంటాయని.. ఇలా వార్తలు వచ్చాయి కానీ.. అఫిషియల్ గా ఏమీ ఎనౌన్స్ చేయలేదు.
పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడం వలన శ్రుతిహాసన్ తో సీన్స్ అండ్ సాంగ్ డౌటే అని కూడా టాక్ వినిపించింది. దీంతో వకీల్ సాబ్ లో శ్రుతిహాసన్ అసలు ఉంటుందా.? ఉండదా..? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. ఫైనల్ గా వకీల్ సాబ్ లో శ్రుతిహాసన్ పాత్ర ఉందని తెలిసింది. అయితే.. హీరోయిన్ గా కాదు.. అతిథి పాత్ర అని శ్రుతిహాసన్ క్లారిటీ ఇచ్చింది. ఇంకా ఈ సినిమా గురించి ఏం చెప్పిందంటే… ‘వకీల్ సాబ్’ మూవీలో నటించాను.
అయితే.. ఈ సినిమాలో హీరోయిన్ అని చెప్పలేను కానీ.. అతిథి పాత్ర అని చెప్పచ్చు. సినిమాలో కాసేపు కనిపిస్తాను అయితే.. కనిపించిన కాసేపే అయినా నా పాత్ర మాత్రం ఆకట్టుకునేలా ఉంటుంది అన్నారు. అంతే కాకుండా… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం ఎప్పుడు వచ్చినా వదులుకోను అని చెప్పింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాని ఏప్రిల్ 9న భారీ స్ధాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Must Read ;- షూటింగ్ లో పాల్గొన్న పవన్.. ఇంతకీ.. ఏ మూవీ?