తమిళ స్టార్ హీరో విజయ్ ఇటీవల మాస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తమిళనాడులోనే కాకుండా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ కలెక్షన్స్ వసూలు చేయడం విశేషం. ఒకప్పుడు తెలుగులో విజయ్ సినిమాలకు ఆదరణ అంతగా ఉండేదు కాదు కానీ.. ఈమధ్య విజయ్ తెలుగులో మార్కెట్ ను బాగా పెంచుకున్నాడని చెప్పచ్చు. ఇదిలా ఉంటే.. విజయ్ తదుపరి చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో చేస్తున్నాడు.
ఇది విజయ్ 65వ చిత్రం. విజయ్.. నెల్సన్ కి అవకాశం ఇవ్వడం కోలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు. కేజీయఫ్ స్టంట్ మాస్టర్స్ అన్బు – అరివు లు యాక్షన్ పార్ట్ ను కొరియోగ్రాఫ్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
విభిన్న కథాంశంతో రూపొందే ఈ మూవీలో విజయ్ సరసన నటించే హీరోయిన్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. కారణం ఏంటంటే.. ఈ సినిమా కోసం ముగ్గురు పాన్ ఇండియా హీరోయిన్స్ ని పరిశీలిస్తున్నారని తెలిసింది. క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే పేరు గట్టిగా వినిపించింది. ఇప్పుడు మరో ఇద్దరు క్రేజీ హీరోయిన్స్ రష్మిక, బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీని కూడా పరిశీలిస్తున్నారని తెలిసింది. దీంతో ఈ ముగ్గురు హీరోయిన్స్ లో ఎవరు విజయ్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంటారో చూడాలి.
Must Read ;- విజయ్ జోడీగా ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ