అందానికి చుట్టం కానివారెవరూ? .. అందానికి పట్టం కట్టనివారెవరూ? అందానికి అందరూ అభిమానులే .. అది కాస్త ముదిరితే ప్రేమికులే. సినిమా హీరోయిన్లంటే అందంగా ఉంటారు .. వాళ్ల ఫోటోలను చూస్తూ మురిసిపోవడం .. మైమరచిపోవడం చాలా సహజం. అందువల్లనేనేమో అనూ ఇమ్మాన్యుయేల్ కి హిట్లు పెద్దగా లేకపోయినా అందంతోనే కెరియర్ ను నెట్టుకొచ్చేస్తోంది. కుర్ర హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తోంది. ఆల్రెడీ ‘మహాసముద్రం‘ సినిమాకి సైన్ చేసేసింది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది.
అనూ అమ్మాన్యుయేల్ కి అదృష్టం కలిసిరాలేదు గానీ, అందానికేం తక్కువలేదు. ఆమె కళ్లు చూసిన కుర్రాళ్లకు కంటిపై కునుకు పడటం కష్టమే. ఆమె చూపులలోని కైపులు వాళ్లకు పగలు రేయి తేడా తెలియకుండా చేస్తుంటాయి. తేనె నింపుకున్న పెదాలు .. మంచిగంధం ఒంపుకున్న ఛాయ .. ఆమె సొంతం. అందగత్తె లక్షణాలు ఎలా ఉంటాయి అనే ప్రశ్నకు సరైన సమాధానంగా కనిపించే నాయిక ఆమె. అందుకే ఆమెకి మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాల హిట్ ఫ్లాపులతో సంబంధం లేని అభిమానులు ఉన్నారు.
సోషల్ మీడియాలో ఈ సుందరి అప్పుడప్పుడు తళుక్కున మెరుస్తూ ఉంటుంది. ఆ మెరుపు చాలు ఆ వెలుగులో చాలా రోజులు బతికేస్తాం అన్నట్టుగా ఫ్యాన్స్ ఉంటారు. తాజాగా ఆమె ఒక ఫోటోను పోస్ట్ చేసింది. బ్లాక్ డేనీమ్ జీన్స్ .. వైట్ టైట్ షార్ట్ టాప్ ను ధరించిన ఆమె, పట్టులా పట్టుగా అల్లుకున్న అందాలను సడలిస్తున్నట్టుగా ఒక పోజు ఇచ్చింది. వలపుల వాగులోకి తోసే వరూధినిలా రెచ్చగొడుతోంది. ఈ ఫోటో చూస్తుంటే .. కూనిరాగాలు తీసుకుంటూ గడిపే ఈ కుర్రజన్మ ఎందుకు? అందగత్తె ఎదుట అద్దమై నిలిచినా చాలు అనిపిస్తోంది కదూ.
Must Read ;- ‘మహా సముద్రం’ విడుదల తేదీ ఖరారు