ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలనం సృష్టించిన యంగ్ డైరెక్టర్ అజయ్ భూపతి. ఈ సినిమా తర్వాత సెకండ్ మూవీ సెట్ కావడానికి చాలా టైమ్ పట్టింది. ఆఖరికి యువ హీరో శర్వానంద్ – బొమ్మరిల్లు సిద్ధార్థ్ కాంబినేషన్ లో మహా సముద్రం అనే మల్టీస్టారర్ మూవీని అజయ్ తెరకెక్కిస్తున్నారు. ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు.
ఈ క్రేజీ మల్టీస్టారర్ లో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ఈ మూవీ పోస్టర్ సినిమా పై క్యూరియాసిటినీ పెంచేసిందని చెప్పచ్చు. వరుసగా రిలీజ్ డేట్స్ ను ఎనౌన్స్ చేస్తున్న చిత్ర నిర్మాతలు మహా సముద్రం రిలీజ్ డేట్ ను కూడా ఎనౌన్స్ చేశారు. ఇంతకీ ఎప్పుడంటే.. ప్రపంచ వ్యాప్తంగా మహా సముద్రం సినిమాని ఆగస్ట్ 19న విడుదల చేయనున్నట్లు అఫిషియల్ గా ప్రకటించారు.
రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేయడంతో పాటు ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో శర్వానంద్ – సిద్దార్థ్ ఇద్దరూ ఓ బోట్ పై కూర్చొని సిగరెట్ తాగుతూ కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి చైతన్య భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆర్ఎక్స్ 100 సినిమాతో డైరెక్టర్ అజయ్ భూపతి సెన్సేషన్ క్రియేట్ చేయడంతో మహా సముద్రం సినిమాతో కూడా సంచలనం సృష్టించనున్నారని టీమ్ చెబుతున్నారు.
Must Read ;- మళ్ళీ పోలీస్ ఆఫీసర్ గా పాయల్ రాజపుత్