‘ప్రేమ కావాలి, పూలరంగడు, శ్రీమన్నారాయణ, మిస్టర్ పెళ్ళికొడుకు, జంప్ జిలానీ’ లాంటి సినిమాలతో టాలీవుడ్ లో సందడి చేసిన అందాల హీరోయిన్ ఇషా చావ్లా. వీటిలో రెండు హిట్ సినిమాలున్నప్పటికీ.. ఆమెకి సరైన గుర్తింపు రాలేదు. ఆ తర్వాత యం.యస్.రాజు దర్శక నిర్మాణంలో త్రిష, నికిషా పటేల్ తో కలిసి రంభ ఊర్వశి మేనక అనే మూవీకి కమిట్ అయింది. ఎందుకో కానీ.. ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఆపై ఇషా చావ్లా పేరు టాలీవుడ్ లో వినిపించలేదు.
చాన్నాళ్ళ తర్వాత ఇప్పుడు మరోసారి ఇషా బేబ్ టాలీవుడ్ లో ఓ థ్రిల్లర్ మూవీతో రాబోతోంది. సినిమా పేరు ‘అగోచర’. ఇందులో ఆమె అంధురాలిగా నటిస్తోంది. ప్రముఖ సినిమాటో గ్రాఫర్ కబీర్ లాల్ .. ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. పాన్ ఇండియా కేటగిరిలో బహుభాషల్లో సినిమా విడుదల కాబోతోంది. తన చెల్లెలి మర్డర్ కేసును ఇన్వెస్ట్ గేట్ చేసే ఓ అంధురాలిగా ఇషా చావ్లా ఈ సినిమాలో నటిస్తోంది. ఆ విషయంలో ఆమెకు అన్ని విధాలా సహాయపడే పాత్రలో కమల్ కామరాజు నటిస్తున్నారు. లవ్లీ వరల్డ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంటోన్న అగోచర సినిమా జూన్ లో విడుదల కాబోతోంది. మరి ఈ మూవీతో అయినా ఇషా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటుందేమో చూడాలి.
Also Read :‘సలార్’ లో ‘కేజీఎఫ్’ బ్యూటీ ఐటెమ్ సాంగ్ ?
#IshaChawla plays a Blind women who traces her sister’s death in upcoming film #Agochara
Directorial Debut of renowned Cinematographer #KabirLal
Bankrolled by Lovely World Production
The film is slated to release in June@kamalkamaraju @EshaChawla63 pic.twitter.com/QN9fftSYCB
— BARaju (@baraju_SuperHit) March 17, 2021