రెబల్ స్టార్ ప్రభాస్, క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ప్రస్తుతం సెట్స్ మీదున్న .. పాన్ ఇండియా మూవీ ‘సలార్’. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఓ సూపర్ అప్డేట్ ప్రభాస్ అభిమానుల్ని భలేగా ఊరిస్తోంది. అదేంటంటే.. ఇందులో ఒక అదిరిపోయే ఐటెమ్ సాంగ్ ను ప్లాన్ చేశాడట ప్రశాంత్ నీల్. దీని కోసం ఓ క్రేజీ బ్యూటీని ఎంపిక చేశాడట.
కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ తెచ్చుకున్న కథానాయిక శ్రీనిథి శెట్టి సలార్ లోని ఐటెమ్ సాంగ్ తో రెచ్చిపోనుందట. ప్రభాస్ హీరో.. తనకి లైఫిచ్చిన కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ ఇద్దరి కాంబినేషన్ లోని సినిమాలో ఐటెమ్ సాంగ్ చాన్స్ వస్తే ఎవరు వదులు కుంటారు? అందుకే శ్రీనిథి శెట్టి .. తనని సంప్రదించగానే.. రెండో మాట లేకుండా ఓకే చెప్పేసిందట. ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు ఓ రేంజ్ లో నెలకొన్నాయి. మరి ఈ సినిమాలో శ్రీనిథి డ్యాన్స్ .. ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.
Must Read ;- ‘సలార్’ మూవీకి అమెజాన్ ప్రైమ్ మైండ్ బ్లోయింగ్ ఆఫర్