శ్రీహరి ‘శ్రీ మహాలక్ష్మి’ సినిమాతో కథానాయికగా పరిచయం అయింది పూర్ణ అలియాస్ షమ్మా ఖాసిమ్. మదర్ టంగ్ మలయాళమే అయినప్పటికీ.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనే ఆమె ఎక్కువ సినిమాలు చేసింది. అయితే ఆమె ఆశించిన స్థాయిలో ఏ భాషలో కూడా కథానాయికగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. దాంతో కొన్ని సినిమాల్లో ప్రత్యేకపాత్రల్లో కనిపిస్తోంది. అయితే ఈ ఏడాది పూర్ణ .. నెగటివ్ రోల్స్ కూడా షురూ చేసింది.
ఇటీవల రాజ్ తరుణ్ , కొండా విజయ్ కుమార్ కాంబో మూవీ ‘పవర్ ప్లే’ లో క్రూరమైన పాత్రలో మెప్పించిన పూర్ణ.. మే 28న విడుదల కాబోతున్న బాలయ్య, బోయపాటి మూవీలో కూడా నెగెటివ్ షేడ్స్ తో కూడిన పొలిటీషియన్ గా నటించబోతోందని తెలుస్తోంది. ఇక ఆమె ప్రత్యేకపాత్రలో నటిస్తోన్న మరో సినిమా ఏంటంటే.. వెంకీ నటించబోయే ‘దృశ్యం 2’ తెలుగు వెర్షన్ .
మోహన్ లాల్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘దృశ్యం 2’ కు రీమేక్ గా అదే దర్శకుడు జీతు జోసెఫ్ తెరకెక్కించబోతున్న తెలుగు వెర్షన్ లో వెంకీ, మీనా జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఒరిజినల్ వెర్షన్ లో ఇద్దరు పోలీస్ దంపతులు .. హీరో పక్క ఇంట్లో సాధారణ దంపతుల్లా చెలామణి అవుతూ.. అతడి ఆను పానులు కనిపెడుతూ ఉంటారు. అందులో లేడీ పోలీస్ పాత్రను తెలుగు వెర్షన్ లో పూర్ణ చేయబోతోందని సమాచారం. ఈ ఏడాదే విడుదలకు సిద్ధమవుతోన్న వెంకీ ‘దృశ్యం 2’ లోని పోలీస్ పాత్ర పూర్ణ కెరీర్ కు ఏ మేరకు హెల్ప్ అవుతుందో చూడాలి.
Must Read ;- బాబాయ్ ‘దృశ్యం 2’ లో అబ్బాయ్?