Naveen Polishetty :
జాతిరత్నాలు సినిమాతో కుర్రకారును ఒక్క ఊపు ఊపేశాడు నవీన్ పొలిశెట్టి. తాజాగా రా రా కృష్ణయ్య ఫేమ్ మహేష్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి హీరోగా యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తుందని.. దీనికి మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ ఖరారు చేశారని వార్తలు వచ్చాయి. ఇందులో అనుష్క నటిస్తుందని టాక్ వచ్చింది. అయితే.. రీసెంట్ గా ఈ సినిమా లేదు క్యాన్సిల్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల గురించి చిత్ర యూనిట్ ఏ విషయం వెల్లడించలేదు. దీంతో ఈ సినిమా ఉందా? లేదా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.
అయితే జాతిరత్నాలు దాదాపు 40 కోట్ల దాకా కలెక్ట్ చేసి భారీ హిట్ సొంతం చేసుకోవడంతో మరో మూడు సినిమాలు తన బ్యాగులో ఉన్నాయని నవీన్ చెబుతున్నారు. మరి ఆ మూడు సినిమాలు కూడా కామెడీ నేపథ్యంలో ఉంటాయా? లేక కాన్సెప్ట్ నేపథ్యంలో ఉంటాయా? అని మాత్రం చెప్పలేదు. పొలిశెట్టికి కథలు చెప్పడానికి ప్రయత్నిస్తున్న యువ దర్శకులు కన్ ప్యూజన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. పొలిశెట్టి గారూ.. మీరు కాస్త సస్పెన్స్ విప్పితే… మీ కోసం కొన్ని కథలు సిద్ధం చేసుకోవడానికి హెల్ప్ చేసిన వాళ్లవుతారు… ఏమంటారు?
Must Read ;- అనుష్కతో విజయ్ దేవరకొండ.. నిజమేనా.?