Wonders Of Akhanda Collection
బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ‘అఖండ’ సినిమా తొలి రోజునే భారీ వసూళ్లు సాధించినట్టు సమాచారం. రివ్యూల పరంగా చూస్తే డివైడ్ టాక్ వచ్చినా ఓవరాల్ గా సినిమా బాగుందన్న టాక్ అయితే వచ్చింది. కాకపోతే నిడివి కాస్త పెరిగిందని అందరూ అంటున్నారు. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది. ఐఎండీబీ రేటింగుల పరంగారూ బాలయ్య ‘అఖండ’ మాత్రమే అగ్రస్థానంలో ఉంది. ఈ రోజు మోహన్ లాల్ మరక్కార్ మలయాళ వెర్షన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమా నెగిటివ్ రివ్యూలను మూటగట్టుకుంది.
దాంతో రేపు రెండో రోజు కూడా అఖండ వసూళ్ల ఏమాత్రం తగ్గేలా లేవు. ముఖ్యంగా బీ, సీ సెంటర్లలో ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో సినిమాకి మొదట వచ్చిన డివైడ్ టాక్ క్రమంగా సడలి హిట్ రేంజ్ కి సినిమా వెళుతోంది. అఖండ తెలుగు థియేట్రికల్ రైట్స్ 56 కోట్లు, నైజాం ఏపీ 46.5 కోట్లు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రస్తుతం వేరే సినిమాలేవీ బరిలో లేకపోవడం కూడా అఖండకు వరంగా మారింది. సల్మాన్ ఖాన్ సినిమా విడుదలైనా దానికి కూడా యావరేజ్ టాకే ఉంది. ఇక ఓవర్సీస్ లో అయితే బాలయ్య దూకుడు మామూలుగా లేదు.
Wonders Of Akhanda Collection
సినిమా విడుదలకు ముందే భారీ హైప్ వచ్చింది. ఓ 15 నిమిషాల నడివి ఉన్న సన్నివేశాలు తొలగిస్తే సినిమాకి ఇంకా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో ఓవర్సీలో భారీ వసూళ్లు సాధించిన సినిమాలు లేవు. ఆ లోటును అఖండ భర్తీ చేసింది. ఒకవిధంగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ వసూళ్లు కొండంత బలాన్ని ఇచ్చాయి. యూఎస్ లో ప్రీమియర్ షోల ద్వారా మూడు లక్షల డాలర్లు వసూలైనట్టు సమాచారం.
ఇది లాంగ్ రన్ లో రెండు మిలియన్ డాలర్లు వసూలు చేయవచ్చని భావిస్తున్నారు. వసూళ్ల పరంగా ఈ ఏడాది తొలి రికార్డు బాలయ్యదేననాలి. బాలయ్యను అభిమానులకు ఏ రేంజ్ లో చూపాలో ఆ రేంజ్ లో బోయపాటి చూపారు. ఓ పక్క ఆహా ఓటీటీలో బాలయ్య అన్ స్టాపబుల్ షో హిట్ అవడం, మరో పక్క అఖండ ఫలితం చూస్తే బాలయ్య తెలుగు చిత్ర పరిశ్రమలో మళ్లీ కొత్త రికార్డులు క్రియేట్ చేయవచ్చన్న నమ్మకం అభిమానుల్లో కలుగుతోంది.
Must Read ;- అఖండ (రివ్యూ)











