కిడ్నాప్ కేసులో అరెస్టైన భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌ను సికింద్రాబాద్ కోర్టు తిరస్కరించింది. కేసుపై విచారించడానికి అఖిలప్రియను 3 రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తున్నట్లు కోర్టు తెలిపింది. ప్రస్తుతం చంచల్ గూడ మహిళా జైలులో రిమాండు ఖైదీగా ఉన్న అఖిలప్రియను కిడ్నాప్ వ్యవహారంపై పోలీసులు ప్రశ్నించడానికి కోర్టు అనుమతులిచ్చింది.
ప్రవీణ్ రావ్.. వారి ఇరువురి సోదరులను కిడ్నాప్ చేసిన కేసులో జనవరి 6 వ తేదీన పోలీసులు అఖిలప్రియను అదుపులోకి తీసుకున్ని సంగతి తెలిసిందే. కోర్టు తనకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అప్పటి నుండి బెయిల్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్న అఖిలప్రియకు కోర్టు నిర్ణయంతో షాకిచ్చింది. కిడ్నాపు వ్యవహారంపై తన నుండి సమాచారం తెలుసుకోవాలన్న పోలీసు అభ్యర్థనను కోర్టు మన్నించి ఈ నిర్ణయం వెలవరించినట్లు తెలుస్తుంది. అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో బెంగుళూరులో తలదాచుకున్నాడనే సమాచారంతో పోలీసులు చర్యలు తీసుకున్నా కూడా.. ఇప్పటికి అతనెక్కడున్నాడో పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు.
Must Read ;- మాదాల శీను.. బోయినపల్లి కిడ్నాప్ కేసులో సీనంతా ఇతడిదేనట