హైదరాబాదు శివార్లలోని హఫీజ్‌పేట లోని రెండువేల కోట్లరూపాయల భూముల వ్యవహారానికి సంబంధించి.. బోయిన్ పల్లిలో ముగ్గురిని కిడ్నాప్ చేసి వదలిపెట్టడం, ఈ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ రిమాండ్‌లో ఉండడం.. వ్యవహారాలే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా నడుస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఏ1 ఏవీసుబ్బారెడ్డి, ఏ2 భూమా అఖిలప్రియలను అరెస్టు చేశారు. ఇదే కేసులో ఏ3గా ఉన్న భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అతనికోసం పోలీసుల వేట సాగుతోంది. కాగా.. ఆయన బెంగుళూరులో ఆశ్రయం పొంది ఉన్నట్టుగా తెలుస్తోంది.
సంచలనం సృష్టిస్తున్న ఈ కిడ్నాప్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో కొన్ని మార్పులు జరిగాయి. ఏ1గా భూమా అఖిలప్రియ పేరును చేర్చి, ఏ2గా ఏవీ సుబ్బారెడ్డి పేరు రాశారు. ఏ3గా మాత్రం భార్గవరామ్ ఉన్నారు. బుధవారం నాడు కేసు పెట్టినప్పుడు ఏ1 గా సుబ్బారెడ్డి, ఏ2 గా అఖిలప్రియ ఉన్నారు. ఆ సమయంలో.. అసలు నేను ఏ1 ఎలా అవుతా? అంటూ సుబ్బారెడ్డి మీడియాలో ప్రశ్నించిన సంగతి కూడా తెలిసిందే. గురువారం మార్చారు.
కాగా.. ఏ3 గా ఉన్న అఖిలప్రియ భర్త భార్గవరామ్ పరారీలో ఉన్నారు. బెంగుళూరులో తలాచుకున్నారనే సమాచారంతో ప్రత్యేక పోలీసు బృందాలు ఆయనకోసం బెంగుళూరు వెళ్లినట్లు తెలుస్తోంది.
Must Read ;- అప్పటి భూముల పంచాయితీ.. ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ కలిశారా?











