Mammootty To Play Villan Role In Akhil’s Agent Movie :
అక్కినేని అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ రొమాంటిక్ మూవీని బన్నీ వాసు – వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అఖిల్, పూజా హేగ్డే జంటగా నటిస్తున్న ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ పై క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత అఖిల్ ఏజెంట్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని ఎప్పుడో సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా ఇప్పటి వరకు కుదరలేదు. జులై రెండో వారం నుంచి కృష్ణపట్నంలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమాలో మలయాళ అగ్ర హీరో మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రేజీ మూవీలో మమ్ముట్టి నటిస్తున్నారని తెలిసినప్పటి నుంచి విలన్ క్యారెక్టర్ చేస్తున్నారని వార్తలు వచ్చాయ. ఆ తర్వాత విలన్ కాదు.. అఖిల్ తండ్రి పాత్ర అంటూ ప్రచారం జరిగింది.
తాజా వార్త ఏంటంటే.. మమ్ముట్టి ఇందులో అఖిల్ కి గురువు పాత్ర పోషిస్తున్నారు. పాజిటివ్ గా ఈ క్యారెక్టర్ ఉంటుంది. వీరిద్దరి పై వచ్చే సన్నివేశాలు చాలా ఇంట్రస్టింగ్ గా థ్రిల్లింగ్ గా ఉంటాయని సమాచారం. ఈ పాత్ర కోసం మమ్ముట్టికి అక్షరాల మూడు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ ఇస్తున్నారని తెలిసింది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాతో అఖిల్ ఏజెంట్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తారేమో చూడాలి.
Must Read ;- అఖిల్ ‘ఏజెంట్’ కథపై ఇంకా కసరత్తులు?