స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ .. సినిమా జీవితానికి , వైవాహిక జీవితానికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సినిమాల్లోని బిజీనెస్ రియల్ లైఫ్ లో రిఫ్పెక్ట్ కాకుండా.. చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు… తన ముద్దుల పిల్లలతో అల్లరి చేసే ప్రతీ మూమెంట్ ను అతడు సెలబ్రేషన్ కిందే తీసుకుంటాడు. అలాగే.. ఆ వేడుకను తన అభిమానులతో కూడా షేర్ చేస్తూ ఉంటాడు. ఇక అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి చెప్పనే అక్కర్లేదు. ఆమె తన పిల్లల్లాగానే భర్తను కూడా ట్రీట్ చేస్తుంది. ప్రతీ విషయంలో సపోర్టివ్ గా ఉంటూ అవసరమొచ్చినప్పుడు కుటుంబ బాధ్యతను తన భుజానికి ఎత్తుకుంటుంది. అలాంటి ఈ ఆదర్శ దంపతులు పెళ్లి చేసుకొని అప్పుడే పదేళ్ళు అయిపోయింది.
సరిగ్గా 2011, మార్చ్ 6న వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ దంపతులు తమ పదేళ్ళ దాంపత్య జీవితాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. సరిగ్గా వెడ్డింగ్ యానివర్సరీ రోజున ఈ జంట తాజ్ మహల్ దగ్గర ఆ సంతోష సమయాన్ని ఆస్వాదించారు… బన్నీ స్నేహారెడ్డి ఒకరికొకరు ఆనంద చుంబనంతో తమ అన్యోన్యతను చాటుకున్నారు. ఈ విషయాన్ని బన్నీ తన ఇన్ స్టామ్ గ్రామ్ ఖాతాలో తెలియచేసి ఆ ఫోటోను పోస్ట్ చేశాడు. దీని తర్వాత డెహ్రడూన్ పయనమయ్యారు. అభిమానులు వారిద్దరి అన్యోన్యతకి మురిసిపోతున్నారు. ముద్దులొలికే ఇద్దరు పిల్లలు అర్హా, ఆయాన్ లు అల్లు వారి అభిమానులకు లిటిల్ ప్రిన్సెస్ . ఆ ఇద్దరి అల్లరిని బన్నీ ఎప్పుడు పోస్ట్ చేసినా.. సోషల్ మీడియాలో అది ఎప్పుడూ వైరల్ గానే మారుతుంది.
Must Read ;- బన్నీకి విలన్ గా ‘క్రాక్’ జయమ్మ?