దర్శక ధీరుడు రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదల కానున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ యన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తూండడంతో అభిమానులు ఎప్పటికప్పుడు ఈ సినిమా అప్టేట్స్ గురించి ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య విడుదలైన ఇద్దరు హీరోల టీజర్స్ .. మరింతగా అంచనాల్ని పెంచేశాయి.
ఈ నేపథ్యంలో ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ క్లైమాక్స్ గురించి ఓ రూమర్.. అభిమానుల్ని షాక్ కు గురి చేస్తోంది. అదేంటంటే.. ఈ సినిమా క్లైమాక్స్ విషాదాంతంగా ఉంటుందట. అంటే హీరోలు చనిపోరు కానీ.. యన్టీఆర్ కు కళ్లు, రామ్ చరణ్ కు కాళ్ళు పోతాయట. బ్రిటీష్ సైన్యంతో వీరోచితంగా పోరాడిన ఇద్దరూ యుద్ధంలో తమ మాతృభూమికోసం ఆ త్యాగానికి ఒడిగడతారట. ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీన్ని చాలా ఎమోషనల్ గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాడట జక్కన్న.
అందుకే .. ఇప్పటి నుంచే ఈ వార్తను లిక్ కింద స్ప్రెడ్ చేసి.. అభిమానుల్ని ఆ క్లైమాక్స్ ను తట్టుకొనేలా మెంటల్ గా ప్రిపేరు చేసే ప్రయత్నం ప్రారంభించాడట. క్లైమాక్స్ ను ఎప్పుడో చిత్రీకరించిన రాజమౌళి.. మిగిలిన సీన్స్ షూటింగ్ ను ప్రారంభించ బోతున్నాడట. ఇటీవల ఆచార్య మూవీకి సంబంధించిన తన పార్ట్ షూటింగ్ ను ఫినిష్ చేసిన రామ్ చరణ్ .. త్వరలోనే ఆర్.ఆర్.ఆర్ సెట్స్ లోకి తిరిగి రాబోతున్నాడట. ఆ షెడ్యూల్ లో రామ్ చరణ్, ఆలీయా భట్ పై కొన్ని రొమాంటిక్ సీన్స్ ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు. ఇంకో నెల, నెలన్నరలో ఆర్. ఆర్.ఆర్ మూవీ టాకీ పార్ట్ కంప్లీట్ చేయబోతున్నారట. మరి నిజంగానే ఆ క్లైమాక్స్ సినిమాలో ఉంటుందో లేదో తెలియాలంటే.. అక్టోబర్ 13 వరకూ ఆగాల్సిందే.
Must Read ;- రాజమౌళి ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ కు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్











