ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా తాత్కాలికంగా వాయిదా వేసుకుంది. అలాగే రిలీజ్ డేట్ కూడా దాని వల్ల డిస్ట్రబ్ అయింది. అయితే మైత్రీ మూవీ మేకర్స్ వారు తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ‘పుష్ప’ మూవీ రెండో భాగాలు గా రాబోతోంది. ఆ మేరకు దర్శకుడు సుకుమార్ ఈ సినిమా షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత బన్నీ వెంటనే చేయబోయే సినిమా ఏంటనే విషయంలో అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. నిజానికి కొరటాల శివ దర్శకత్వంలో సినిమా అనౌన్స్ మెంట్ జరిగినప్పటికీ.. ఆ మూవీ సెట్స్ మీదకు వెళ్ళడానికి చాలా టైమ్ పడుతుంది. ఆచార్య తర్వాత కొరటాల యన్టీఆర్ తో సినిమా మొదలు పెట్టబోతున్నాడు. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితేనే కానీ.. బన్నీ సినిమాను పట్టాలెక్కించలేడు. అందుకే బన్నీ ‘పుష్ప’ సినిమా తర్వాత .. బోయపాటి శ్రీను దర్శకత్వంలోని సినిమాను మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడట.
లాక్ డౌన్ టైమ్ లో కథలు వింటున్న బన్నీకి బోయపాటి చెప్పిన పవర్ ఫుల్ స్టోరీ తెగ నచ్చేసిందట. ఇది వరకు బన్నీ బోయపాటి దర్శకత్వంలో చేసిన ‘సరైనోడు’ ను మించి ఈ కథ ఉందట. బాలయ్యతో అఖండ కంప్లీట్ అయ్యాకా.. బోయపాటి టేకప్ చేయబోయే ప్రాజెక్ట్ ఇదే అంటున్నారు. అయితే ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేస్తే బాగుంటుందని బన్నీ సూచించాడట. గతంలో ‘సరైనోడు’ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ మూవీ ఏరేంజ్ లో హిట్టైందో తెలిసిందే. అందుకే ఆ సెంటిమెంట్ తోనే బోయపాటి ప్రాజెక్ట్ ను ఈ బ్యానర్ లోనే నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది.
Must Read ;- ‘సరైనోడు’ కాంబో రిపీట్… నిజమేనా?











