Pushpa Movie Shoot Resumes :
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న బారీ చిత్రం పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా కావడంతో అటు అబిమానుల్లోను, ఇటు ఇండస్ట్రీలోను పుష్ప సినిమా పై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు ఆ మధ్య రిలీజ్ చేసిన పుష్ప టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడం.. ఇది అల్లు అర్జున్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో అబిమానులు ఎప్పుడెప్పుడు పుష్ప విడుదల అవుతుందా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఈ క్రేజీ మూవీ లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఈ రోజు నుంచి మళ్లీ పుష్ప రాజ్ షూటింగ్ స్టార్ట్ చేశాడు. ఇంతకీ ఎక్కడంటే.. సికింద్రాబాద్ సమీపంలో ఈ సినిమా షూట్ స్టార్ట్ అయింది. ఈ షెడ్యూల్ కోసం ఓ చిన్న అడవి సెట్ తో పాటు.. లారీలు నిలిపి ఉంటే స్థలాన్ని పోలిన మరో సెట్ వేశారు. ఈ షెడ్యూల్ లో 45 రోజుల పాటు ఉంటుందని సమాచారం. కరోనా పరిస్థితులు తగ్గితే ఇదే షెడ్యూల్ లో రంపచోడవరం అడవుల్లోకి కూడా షూట్ చేయాలనేది ప్లాన్.
దీనికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బన్నీ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాని ఆగష్టు 13న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇక రిలీజ్ ఎప్పుడు అనేది తాజా షెడ్యూల్ పూర్తయిన తర్వాత క్లారిటీ వస్తుంది. మరి.. అల.. వైకుంఠపురములో తర్వాత అల్లు అర్జున్.. రంగస్థలం తర్వాత సుకుమార్ కలిసి చేస్తున్న పుష్ప సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సెట్ చేస్తారో చూడాలి.