ఏపీలోని మున్సిపల్ ఎన్నికలు ఎంతోమందికి వరంగా మారాయి. కూలీలుగా, కార్మికులుగా పనిచేసినవాళ్లకు కౌన్సిలర్, మేయర్ పదవులు దక్కాయి. చిత్తూరు కార్పొరేషన్ నూతన మేయర్‌గా ఎన్నికైన అముద ప్రయాణం కూడా ఎందరికో స్ఫూర్తిపాఠమైంది. ఒకప్పుడు కుటుంబం గడవడం కోసం కట్టెలు కొట్టింది. ఎన్నో కష్టాలు పడింది. మున్సిపల్ ఎన్నికల్లో ఆమెకు అదృష్టం తలుపు తట్టింది. వైస్సార్‌సీపీ తరఫున కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసి గెలవడమేగాక, ఏకంగా మేయర్ పీఠం దక్కించుకుంది.
జగన్ వల్లే…
చిత్తూరు మేయర్ గా ఎన్నికైన ఆముద మాట్లాడుతూ… ‘మాది పేద కుటుంబం. చిన్నప్పుడే నాన్న చనిపోయాడు. దాంతో కుటుంబ భారం, బాధ్యత అక్క, నాపై పడింది. అక్కతోపాటు పనికిపోయేదాన్ని. కట్టేలు కొట్టేందుకు అడవికి వెళ్లేవాళ్లం. ఎంతో కష్టపడి కట్టెలు కొట్టినా రూ.20 మాత్రమే వచ్చేది. ఇప్పుడిప్పుడే లైఫ్ లో సెటిల్ అవుతున్నాం. అయితే నేనెవరో కూడా జనానికి తెలియదు. జగనన్నను చూసి ఓట్లేసి నన్ను గెలిపించారు. ఇప్పుడు మేయర్ పీఠం కట్టబెట్టారు. ఊహించని ఈ అవకాశం నాలో బాధ్యత పెంచింది. ప్రజలకు అందుబాటులో ఉండి, సమస్యలను పరిష్కరిస్తా’’ అని అన్నారు.
Must Read ;- పంతం నెగ్గించుకున్న జేసీ.. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నిక