ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందుకు పంపిణీకి అడ్డంకులు తొలగిపోయాయి.ఇప్పటికే ఆనందయ్య మందు వల్ల ఎలాంటి దుష్ఫలితాలు లేవని ఆయుష్ ప్రటించింది.తాజాగా ఆనందయ్య మందులు పరీక్షించిన సీసీఆర్ఏఎస్ నివేదిక కూడా అనుకూలంగా వచ్చింది.ఈ నివేదిక ప్రకారం ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.ఆనందయ్య నాలుగు రకాల మందులు తయారు చేస్తుండగా మూడు మందుల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ లభించింది.అయితే కంట్లో వేసే మందుకు సంబంధించిన పరీక్షల నివేదికలు ఇంకా అందాల్సి ఉంది.అప్పటి వరకు కంట్లో వేసే మందుకు అనుమతి నిలిపి వేశారు.పూర్తి నివేదిక వచ్చిన తరవాత కంట్లో వేసే మందుపై కూడా ప్రభుత్వం నిర్ణయాన్ని వెల్లడించనుంది.
ఆనందయ్య మందుల వల్ల హాని లేదు
ఆనందయ్య ఉచితంగా పంపిణీ చేస్తున్న మందుల వల్ల ఎలాంటి హాని లేదని కేంద్ర సంస్థలు నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైంది.దీంతో ప్రభుత్వం ఆనందయ్య మందుల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అయితే ఆనందయ్య మందులు వాడితే కోవిడ్ తగ్గుతుందని చెప్పలేమని నివేదికల్లో పేర్కొన్నారు.కంట్లో వేసే మందుపై ఇంకా పరీక్షలు కొనసాగుతున్నాయని ఆ నివేదికలు రావడానికి ఇంకా రెండు మూడు వారాలు పట్టే అవకాశం ఉందని తాజాగా సమర్పించిన నివేదికలో తెలిపారు.అప్పటి వరకు కంటి మందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రభుత్వం ప్రకటించింది.
Must Read ;- ఆనందయ్య మందుపై వివాదాలెందుకు: చినజీయర్ స్వామి











