ఢిల్లీలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత మాజీ మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్ లో అడుగుపెట్టారు. మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున శంషాబాద్ కు చేరుకొని ఘనస్వాగతం పలికారు. ఈటలకు పూలమాలలు వేసి, తిలకం దిద్దారు. జై ఈటల జైజై ఈటల అంటూ నినాదాలు చేశారు. కార్యకర్తల నినాదాలతో ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాలు మార్మోగాయి. ఈటల వస్తున్నారనే సమాచారం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎయిర్ పోర్టుకు వెళ్లారు. నాయకులు, కార్యకర్తలు భారీగా రావడంతో పోలీసులు అదుపు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఇవాళ తన తన అనుచరులతో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో మరో ఉద్యమం మొదలైందన్నారు. సీఎం కేసీఆర్ ను గద్దె దించడమే బీజేపీ లక్ష్యమన్నారు. ఒక్కసారి ఓడినందుకే కేసీఆర్ తనకు సభ్యత్వం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అన్ని స్థానాలు గెలుచుకొని కేసీఆర్ తగిన బుద్ధి చెప్తామన్నారు.
Must Read ;- ఈటల రాజేందర్ బృందానికి ప్రమాదం తృటిలో తప్పిన ప్రమాదం