కరోనాకు ఎవరి మీద కనికరం లేదు.. అది అనసూయ అయినా సరే. యాంకర్ అనసూయ కూడా ఇప్పుడు కరోనా బారిన పడిందనే అనుమానం కలిగింది. తనకు ఆ లక్షణాలు ఉన్నాయంటూ ఆమె స్వయంగా ప్రకటించడంతో ఆ వార్త వైరల్ గా మారింది. ఈరోజు ఉదయం కర్నూలులో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె బయలు దేరగా కొద్దిగా కరోనా లక్షణాలు కనపించడంతో తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నట్టు ఆమె ప్రకటించింది.
తన కుటుంబ సభ్యులందరం కరోనా పరీక్షలు చేయించుకుంటామని తెలిపింది. తనను కలిసిన వారంతా కూడా పరీక్షలు చేయించుకోవాలని కోరింది. రెండు రోజుల క్రితమే అనసూయ ఓ వెబ్ సిరీస్ ప్రారంభోత్సవంలో పాల్గొంది. అందులో నిహారిక కూడా నటిస్తోంది. ఇప్పుడు నిహారిక కూడా పరీక్షలు చేయించుకోక తప్పదేమో. నిహారిక ఒక్కటే కాదు ఆమెతో పాటు ఆమె భర్త కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర కూడా ఇందులో నటిస్తున్నాడు.
Must Read ;- సిల్క్ స్మిత పాత్రలో అందాల అనసూయ?