ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇందుకు గాను ఏర్పడ్డ అధికారుల కమిటీ.. ప్రభుత్వానికి కొన్ని సిఫారసులు చేసింది. అరకు లోక్ సభ నియోజకవర్గం పరిధిలో.. పాడేరు, పార్వతీపురం కేంద్రాలుగా రెండు కొత్త జిల్లాలు ఏర్పటు చేయాలని సూచించింది. మొత్తం 38 రెవెన్యూ డివిజన్లలో మార్పులు చేర్పులకు ప్రతిపాదనలు చేసింది.
కొత్తగా 9 రెవెన్యూ డివిజన్లు ఏర్పటు చేయడంతో పాటు.. ఇప్పుడున్న 3 డివిజన్ల రద్దుకు సిఫారసు చేసింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు, పశ్చిమగోదావరి జిల్లా కుకునూరు, తూర్పుగోదావరి జిల్లా ఎటపాక రెవెన్యూ డివిజన్లను పూర్తిగా రద్దు చేయాలని ప్రతిపాదించింది. జిల్లాల నుంచి సేకరించిన మొత్తం సమాచారాన్ని క్రోడీకరించి.. తాజా సిఫారసులతో నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించింది. ప్రతి జిల్లాకు 2-3 రెవెన్యూ డివిజన్లను ప్రతిపాదించింది. ఏర్పడబోయే కొత్త జిల్లాలకు అనుగుణంగా కొత్త పోలీసు జిల్లాల హద్దులపై ఆ శాఖ దృష్టి సారించాలని సూచించింది. మిగిలిన అన్ని శాఖలు కూడా మారనున్న జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల హద్దులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారుల కమిటీ కోరింది.
Must Read ;- 17 నుంచి ఏపీలో ధ్వంసమైన ఆలయాల సందర్శన : చినజీయర్ స్వామి