సినిమా రంగ సెలబ్రిటీల ఇంట ఏది జరిగినా అది పెద్ద సంచలనమే. నిన్న కాక మొన్న హీరోయిన్ సమంత, నాగచైతన్యలు విడిపోబోతున్నారన్న వార్త తెగ వైరల్ అయ్యింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ వార్త రకరకాల పద్దతుల్లో చక్కర్లు కొట్టింది. నిప్పు లేకుండా పొగరాదన్నట్లుగానే ఆ తర్వాత ఆ వార్త నిజమైంది కూడా. నాగచైతన్య, సమంత తాము విడిపోతున్నామని సోషల్ మీడియా వేదికగానే అధికారికంగా వివరించారు. అలాంటి విడాకుల అంశం మరొకటి తెలుగు చిత్ర పరిశ్రమలో త్వరలోనే వెలుగు చూడబోతోందనుకోవచ్చు.
పైగా ఈ వార్త తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ హీరో కుటుంబానికి సంబంధించినది. ఎవరా హీరో ఏమా కథ అన్న క్యూరియాసిటీ నెలకొనడం సహజం. మనం ఇంతకుముందు అనుకున్నట్లుగానే నిప్పులేకుండా పొగరాదనే విషయాన్ని మరోసారి గుర్తుచేసుకోవాలి. ఆ హీరో కుమార్తెకు ఆల్రెడీ పెళ్లయ్యింది. ప్రస్తుతం ఆమెకు భర్తతో పొసగడం లేదన్నది సమాచారం. ఇద్దరికీ నచ్చచెప్పే ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో విడిపోవడానికే ఈ జంట నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఆ హీరో ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో కుటుంబ సమస్య వచ్చి పడింది. ఇది బయటికి వస్తే జనం ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్న భయం సహజంగానే ఉంటుంది. అయినా ఈరోజుల్లో ఇలాంటివి సహజమేనని ధైర్యం చెప్పే శ్రేయోభిలాషులు కూడా ఉంటారు కదా. తప్పు ఎవరిదైనా సాధారణంగా ఆడవారినే వేలెత్తి చూపుతుంటారు. సమంత విషయంలో జరిగింది కూడా అదే.
మరి ఈ హీరోగారి కూతురి విషయంలో ఏం జరిగిందో ఏమోగాని ఆ కుటుంబ సభ్యులు మాత్రం మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆ హీరో ఎవరు? ఆ కూతురి పేరేమిటి? అనే విషయాలు బహిర్గతమయ్యే అవకాశం ఉంది. కాకపోతే సోషల్ మీడియాకు కళ్లెం వేయాలంటే సాధ్యం కాదు గదా. ఈలోపే ఈ వార్తను కూడా వైరల్ చేసే అవకాశం లేకపోలేదు. మనం మాత్రం అప్పటిదాకా వేచిచూద్దాం.
Must Read ;- తాను పర్ ఫెక్ట్ కానంటూ ఇన్ స్టాలో సమంత పోస్ట్!











