కాస్త రిలాక్స్ అయిన సమంత సోషల్ మీడియాలో రీస్టార్స్ అయ్యింది. నాగచైతన్య నుంచి ఆమె విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె కొంతకాలంగా సోషల్ మీడయాకు దూరంగా ఉన్నారు. తన గురించి వీడియోలు చేసిన యూట్యూబ్ ఛానెళ్లపై కోర్టుకు కూడా వెళ్లారు. దాంతో పాటు తాను కూడా రిలాక్స్ అయ్యేందుకు తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి టూర్ కు వెళ్లారు. ఇదిలా ఉంటే ఇన్ స్టాలో ఆమె తాజా పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ కన్నా ముందు మరో పోస్ట్ చేసి డిలిట్ చేసింది.
ఇటీవల ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇది మీడియా ద్వారా హైలైట్ కావడంతో సమంత కూడా స్పందించింది. వారికి విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టింది. తర్వాత ఏమనుకుందో ఏమో దాన్ని డిలిట్ చేసింది. దాని వల్ల రాంగ్ ఇండికేషన్స్ వెళ్లే ప్రమాదం ఉందని గ్రహించినట్టుంది. తన ఫ్రెండ్ ప్రీతమ్ కూడా గే అనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ పోస్ట్ ఆమె పెట్టి ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేశారు. సరే ఆ పోస్ట్ సంగతి అలా ఉంచితే ఆమె సినిమాల విషయంలో దూకుడు గానే ఉన్నారు.
ఆమె పూర్తిగా రిలాక్స్ అయినట్టు తాజా పోస్టు చూస్తేనే అర్థమవుతుంది. కాకపోతే ఆమె ఇన్ స్టాలో తాజాగా పెట్టిన పోస్టు కూడా ఆమె మనోభావాలకు అద్దం పడుతోంది. బ్యాక్ టు నార్మల్ లైఫ్ అంటూ ఆమె పోస్టులు పెడుతోంది. అమ్మ చెప్పింది పేరుతో ఆసక్తికర పోస్టులు పెడుతోంది. వాటిలో నేను పర్ ఫెక్ట్ కాదు అంటూ ఆమె పెట్టిన పోస్టు మాత్రం వైరల్ అయ్యింది. తాను శక్తిమంతురాలినని, దేనినైనా భరిస్తానని పేర్కొంది.
తాను పర్ ఫెక్ట్ కాకపోయినా తనకు తాను పర్ ఫెక్టేనని అంది. దేనికీ వెనకడుగు వేయనని కూడా స్పష్టం చేసింది. ‘నేను ప్రేమ, దయ కలిగిన దాన్ని.. కానీ భయంకరమైన దాన్ని కూడా. నేను మనిషినే అయినా నాలో పోరాట పటిమ ఉంది’ అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్టు నుంచి ఎలాంటి అర్థాన్ని వెతుక్కోవాలో నెటిజన్లకు తెలుసు కాబట్టి ఆ అర్థాన్నే వెతుకున్నారు. అందుకే ఈ పోస్టు వైరల్ అయ్యింది.
Must Read ;- సమంత ఇప్పుడు ఏం చేయబోతోంది?











