హీరోలుగా నటించిన కమెడియన్స్ అందరూ బ్యాక్ పెవిలియన్ దారి పట్టగా , కమెడియన్ సప్తగిరి మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా సక్సెస్ కోసం పాటు పడుతూనే ఉన్నారు. ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్ ,సప్తగిరి ఎల్. ఎల్. బి, వజ్రకవచధార గోవిందా’ లాంటి సినిమాల్లో సప్తగిరి హీరోగా నటించాడు. అయితే వాటిలో ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ సినిమా ఒకటే ఒక మాదిరి కలెక్షన్స్ రాబట్టింది. అయినా సరే సప్తగిరి ఇటు హీరోగానూ, అటు కమెడియన్ గానూ కంటిన్యూ అవుతూ.. కెరీర్ ను లాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సప్తగిరి మరో కొత్త సినిమా మొదలు పెట్టనున్నాడు.
ప్రస్తుతం ‘సిద్ధు ఫ్రం శ్రీకాకుళం , సీతారాముల కళ్యాణం లంకలో’ లాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన ఈశ్వర్ రెడ్డి డైరెక్షన్ లో ఓ సినిమా మొదలు పెట్టారు సప్తగిరి. దాదాపు ఆ సినిమా పూర్తి అయినట్లే. కరోనా కారణంగా కొంతవర్క్ పెండింగ్ ఉంది. తాజాగా కుమార్ అనే కొత్త దర్శకుడి తో సప్తగిరి హీరో గా ఓ సినిమా ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. త్వరలోనే ఈ సినిమా అనౌన్స్ మెంట్ రానున్నదని సమాచారం.











