‘సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు’ నినాదంతో తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 29న పురుడుపోసుకుంది. ఎన్నో సవాళ్లు, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తెలుగు రాష్ర్టాల్లో తనదైన ముద్ర వేసింది. టీడీపీ 40 ఏళ్లు నిండిన సందర్భంగా పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ కార్యకర్తలు లేఖ రాశారు. టీడీపీకి బలం కార్యకర్తలు.. నాయకులే అన్నారు. పార్టీ కోసం కష్టపడేవారికి భరోసా ఇస్తామన్నారు.. ‘తెలుగుజాతి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉంది. పార్టీ ఆరంభించిన నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి పేదలకు కూడు, గూడు, గుడ్డ అందించే పథకాలు ఆరంభించారు. నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రగతికి, ప్రజా సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తూనే వుంది. 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ కుటుంబసభ్యులందరికీ పేరుపేరునా శుభాకాంక్షలు’’ అని తెలిపారు.
Must Read ;- అన్నా.. మళ్లీ ఎప్పుడు పుడతావు!
తెలుగుజాతికి 40 ఏళ్ల అండ ..తెలుగుదేశం జెండా..
తెలుగుదేశం బలం, బలగం వెన్నుచూపని కార్యకర్తలు, నాయకులే!పార్టీ బలోపేతానికి కృషి చేస్తోన్న టిడిపి కుటుంబసభ్యులందరి సంక్షేమానికి కృషి చేస్తాం. #40YearsOfTeluguDesam (1/2) pic.twitter.com/b4ce6895ir— Lokesh Nara (@naralokesh) March 28, 2021