వైసీపీ ప్రభుత్వ పాలనను చరమగీతం పాడాలి..
అప్రటికత విద్యుత్ కోతలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడులు నిరసన వ్యక్తం చేశారు. శనివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి నిరసన చేపట్టారు. కార్యకర్తలతో సమీక్షిస్తున్న తరుణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం నెలకొంది. దీంతో అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు తోపాటు అక్కడ ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలంతా తమవద్దనున్న సెల్ ఫోన్ లైట్లు చూపిస్తూ నిరసన తెలియజేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వ హయంలో అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తున్నారని, దీంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడేందుకు రోజులు దగ్గరపడ్డాయని విమర్శించారు.
Must Read:-అవినీతిపరుల కోసం జగన్ కొత్త పథకం : అచ్చెన్నాయుడు











