ప్రజల ఇచ్చిన అధికారం.. ప్రజా సంక్షేమానికే వినియోగించాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇదేమీ తెలియనట్టు ఉందేమో.. ఒక్క అవకాశం అని చెప్పి గద్దెనెక్కిన జగన్.. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా మరిచి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు అంతటా వినిపిస్తున్నాయి. గతంలో ఆయన చేసిన తప్పులే నీడలా వెంటాడుతున్నాయి. అధికార బలంతో తప్పించుకునే ప్రయత్నం చేసినా.. మళ్లీ ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. తాజాగా ఏపీ సీఎం మరో గండంలో చిక్కుకున్నారు. ఆయనపై గతంలో నమోదైన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవడం వివాదాస్పదమవుతోంది. చివరకు ఈ విషయం కోర్టు దృష్టికి రావడంతో హైకోర్టు పరిపాలన విభాగం వీటిని పరిశీలించి సుమోటోగా విచారణకు తీసుకుంది.
11 క్రిమినల్ కేసులు
జగన్ రెడ్డి ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో మొత్తం 11 క్రిమినల్ నమోదు అయ్యాయి. అందులో అనంతపురం జిల్లాకు సంబంధించినవి 5 కాగా, గుంటూరులో 6 కేసులు నమోదు అయ్యాయి. అయితే అధికారంలోకి వచ్చాక నిబంధనలకు విరుద్ధంగా కేసులను కొట్టించుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కరోనా సమయంలో పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో ఈ కేసులను హడావుడిగా ఉపసంహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం జగన్ పట్ల హైకోర్టు ఎలా వ్యవహరిస్తుందోనని వైసీపీ నాయకుల్లో కొత్త టెన్షన్ మొదలైంది.
Must Read ;- సీబీఐ కేసున్నా సరస్వతి పవర్‌కు లీజు గడువు పెంపు.. హైకోర్టులో రఘురామ పిటిషన్