2019 ఎన్నికలలో 86 శాతం సీట్లు, 50 శాతం ఓట్లు సంపాదించుకొని అధికారం చేపట్టింది వైసీపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న రాష్ట్ర ప్రజలకు జగన్ తీవ్ర నిరాశే మిగిలిచ్చారు. 90 శాతానికి పైగా హామీలు నెరవేర్చామని ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేస్తున్నా ఆచరణలో మాత్రంలో ఎక్కడా కనిపించడం లేదు. ప్రజలు, ప్రతిపక్షాలే కాదు.. ఇప్పుడు ఏకంగా మావోయిస్టులు సైతం జగన్ రెండేళ్ల పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవినీతి కేసులకు తలొగ్గి…
అవినీతి కేసుల కారణంగా సీఎం జగన్ కేంద్రానికి తలొగ్గారని, అందుకే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని మావోయిస్టు పార్టీ విమర్శించింది. రెండేళ్ల జగన్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని స్పష్టం చేసింది. జగన్ నిరంకుశ విధానాలపై పోరాటం చేయాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో నిన్న ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేశ్ ఓ లేఖను విడుదల చేశారు. సీఎం జగన్ సంక్షేమాన్ని పక్కనపెట్టి రాజద్రోహం కేసులు, అక్రమ అరెస్టులు, నిర్భంధాలకు మద్దతు ఇస్తున్నారని మావోయిస్టులు ఆరోపించారు. మోడీ, షాలకు భయపడి హోదాను తాకట్టు పెట్టారని లేఖలో రాశారు. ఈ మధ్యనే ఏపీ సరిహద్దులో ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టు ముఖ్య నాయకుడు గణేశ్ చాకచక్యంతో తప్పించుకున్నాడు. అప్పట్నుంచి వైసీపీ ప్రభుత్వ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ మన్యంలో తరచుగా ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. మావోయిస్టుల కార్యాకాలపాలు బలంగా దెబ్బతిన్నాయి. ఏ చిన్న అనుమానం వచ్చిన పోలీసుల కూంబింగ్ చేస్తున్నారు. ఇటీవల పోలీసుల కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. తప్పించుకున్నవాళ్ల కోసం పోలీసులు ముమ్మర చర్యలు చేపడుతున్నారు.తాజాగా మావోయిస్టు లేఖతో పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ చేస్తున్నారు.
రెండేళ్లయినా..
ఎన్నికల సమయంలో 25 మంది ఎంపీలను గెలిపిస్తే హోదా తీసుకొస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఏపీ ప్రజలు 22 ఎంపీ సీట్లు కట్టబెట్టారు. హోదా విషయంలో సీఎం జగన్ కేంద్రానికి విజ్ఞప్తి చేసినా.. హామీ అమలుకు మాత్రం గట్టిగా ప్రయత్నించడం లేదనే ఆరోపణలు అంతటా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అక్రమాస్తుల కేసుల నుంచి బయట పడేందుకు మెతక వైఖరి అవలంబిస్తున్నాడని సొంత పార్టీలనే నేతలే అభిప్రాయ పడుతుండట విశేషం. తాజాగా మావోయిస్టు పార్టీ హోదాపై లేఖ రాయడంతో మరోసారి హాట్ టాపిక్ గామారింది. ఇప్పటికే ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ ప్రభుత్వం హోదాను సాధిస్తుందా?.. మళ్లీ కాలయాపన చేస్తుందనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి.
Must Read ;- అడుసు తొక్కనేల, కాళ్లు కడగనేల.. క్షత్రియులను శాంతింప చేయడానికి టీటీడీ ఛైర్మన్ పదవి?