దివంగత నందమూరి రామరావుకు భారతరత్న ఇవ్వాలని టీడీపీ నాయకులు, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు డిమాండ్ చేశారు. టీడీపీ మహానాడు సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భారతరత్నకు ఎన్టీఆర్ అన్ని విధాల అర్హుడని, దీని కోసం టీడీపీ నాయకులు ప్రభుత్వాలపై ఒత్తిడి తెవాలని ఆయన పిలుపునిచ్చారు. బడుగు, బలహీన.. అన్ని వర్గాల చేయూత అందించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు. పేదల బాగోగుల గురించి ఆయన కేజీ బియ్యం రూ.2 లకే ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ మాతృభాష కోసం ఎంతో పాటు పడితే, జగన్ మాత్రం తెలుగును పట్టించుకోవడం ఆశోక్ గజపతిరాజు అన్నారు.
Must Read ;- ఎన్టీఆర్ రత్నం కాదా?.. భారతరత్న ఎందుకు రాదు?











