భారత స్టార్ అథ్లెట్ హిమదాస్ కల నిజమైంది. అస్సాం ప్రభుత్వం ఉన్నతోద్యోగంతో ఆమెను గౌరవించింది. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) పదవితో సత్కరించింది. శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో 21 ఏళ్ల హిమదాస్‌కు అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ నియామక పత్రాలు అందజేశారు.
400 మీ. పరుగులో స్వర్ణం
2018లో ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్‌లో 400 మీ. పరుగులో స్వర్ణం గెలిచారు హిమదాస్. అక్కడి నుంచి అంతర్జాతీయ పతకాలు కొల్లగొడుతూనే ఉన్నారు. అదే ఏడాది ఆసియా క్రీడల్లో వ్యక్తిగత రజతంతో పాటు రిలేలో రెండు బంగారు పతకాలు సొంతం చేసుకున్నారు.
పోలీస్ కావాలనే తన చిన్నప్పటి కల నిజమైందని హిమదాస్ వెల్లడించారు. తన జీవితంలో మరచిపోలేని గొప్ప రోజు ఇదేనని.. ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Must Read ;- ఆ విమానం నడిపేది మహిళా పైలెట్లే..!