ఆరు గ్రహాలు ఒకే రాశిలో.. అనుగ్రహిస్తాయా? ఆగ్రహిస్తాయా? అనే శీర్షికతో లియో న్యూస్ ఓ కథనం రాసింది. అంతరిక్షంలో అరుదైన గ్రహకలయికలు ఉన్నప్పుడల్లా ఉత్పాతాలు ఏర్పడతాయన్నది ఈ కథనం సారాంశం. ఫిబ్రవరి 10 నుంచి 12 తేదీ వరకూ ఒకే రాశిలో ఆరు గ్రహాలు కలవడం ఎలాంటి పరిణామాలకు దారితీయవచ్చన్న అంశాన్ని మన జ్యోతిష పండితులు చర్చించారు. ఇలాంటి గ్రహ కూటమి ఉన్నప్పుడు కాలసర్పదోషం ఏర్పడటం కూడా జరుగుతుంటుంది. ఇలాంటి గ్రహ కూటములు ఏర్పడటం అరుదైన విషయమే అయినా దీనికి వైరస్ పుట్టుకకూ ఏదైనా సంబంధం ఉందా లేదా అనే విషయంపై జ్యోతిష పండితులు కూడా స్పష్టంగా ఏదీ చెప్పలేకపోతున్నారు.

ఆరు గ్రహాలు మాత్రమే కాదు మనకున్న నవగ్రహాల్లో ఎనిమిది గ్రహాలు ఒ1962 ఫిబ్రవరి 4, 5 తేదీల్లో కలిశాయి. దీన్ని అష్ట గ్రహ కూటమి అంటారు. ఆ ఏడాది రష్యా, అమెరికాలు సంక్షోభంలో చిక్కుకోవడం, ఆ పరిణామం యుధ్దాలకు దారితీయడం జరిగింది. 2019 డిసెంబరులో ధనుస్సు రాశిలో శని, కేతువు, గురువు, చంద్ర, రవి, బుధ గ్రహాలు కలిసిన తర్వాత కరోనా వైరస్ ప్రబలిన సంగతి తెలిసిందే. అప్పుడు ఏర్పడిన గ్రహ కూటమి ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ పునరావృతమైంది. ఈ తరహా వైరస్ లు ఇంతలా ప్రబలడానికి కాలసర్పదోషంలో ఉండే ఈ అరుదైన గ్రహ కూటములే కారణమన్న వాదన జ్యోతిష పండితుల్లో ఉంది.

ఆ ప్రకారం చూసినప్పుడు ఈ వైరస్ ల బారినుంచి బయట పడటానికి ఇంకా ఎంత కాలం పడుతుందో కూడా చూద్దాం. ఈ ఏప్రిల్ 13వ తేదీ వరకూ తీవ్రమైన కాలసర్ప దోషం ఉంది. రాహుకేతువులు వృషభ, వృశ్చిక రాశుల్లో ఉన్నారు. మిగిలిన గ్రహాలన్నీ ధనుస్సు నుంచి వృషభం వరకూ రాహుకేతువుల మధ్య ఉన్నాయి. ఆ తర్వాత కుజుడు వృషభ రాశి నుంచి బయటపడి మిధున రాశికి చేరుకున్నాడు. కానీ ఇది కుజుడికి శత్రు రాశి. కనీసం బుధుడు మిధున రాశికి చేరుకుంటే గాని పరిస్థితి అదుపులోకి వచ్చే వాతావరణం కనిపించడం లేదు.
అలా చూసినప్పుడు మే 26 నుంచి పరిస్థితులు చక్కబడటానికి అవకాశం కనిపిస్తోంది. 29వ తేదీకి శుక్రుడు కూడా మిధున రాశికి చేరుకుంటాడు. జ్యోతిష పరమైన విశ్లేషణ ప్రకారం చూస్తే మే నెల గడిస్తేగాని కరోనా వైరస్ అదుపులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. అంటే దాదాపు మరో నెల రోజుల పాటు ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకుని వైరస్ సోకకుండా జాగ్రత్త పడితే మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనడానికి అవకాశం ఉంది. ఇది మా జ్యోతిష నిపుణులు అందించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం.
Must Read ;- ముహూర్తాలున్నాయి.. పెళ్లిళ్లు జరిగేనా?











