ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవల విలన్ పాత్ర ధారి ఫహద్ ఫాజిల్ సెట్స్ లోకి అడుగుపెట్టాడు. అలాగే.. అనసూయ కూడా పుష్ప షూట్ లో పాల్గొందని వార్తలొస్తున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం తీసుకున్న గ్యాప్ లో అల్లు అర్జున్.. తన చిన్నారి తనయ అర్హ అల్లరిని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇటీవల అల్లు అర్జున్ సతీమణి.. స్నేహారెడ్డి తన ఇస్టా గ్రామ్ అఫీషియల్ అకౌంట్లో ఓ క్యూట్ ఫోటోను పోస్ట్ చేసింది. అందులో అల్లు అర్జున్ గుండెలపై అర్హ నుంచొని చేతులు పైకి పెట్టి అల్లరి చేస్తున్నట్టు రివీలైంది. బన్నీకి తన కూతురు అర్హ అన్నా, తనయుడు అయాన్ అన్నా ప్రాణం. ఎప్పుడు విరామం దొరికినా.. ఇంట్లో వారిద్దరితోనూ అల్లరి చేయడం అతడికి హాబీగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ప్రస్తుతం తన గుండెల మీద నిలబడి.. పోజిచ్చిన కూతురి అల్లరిని బాగా ఎంజాయ్ చేస్తున్నాడని అర్ధమవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో భలే వైరల్ గా మారింది. అభిమానులైతే… తండ్రీ కూతుళ్ళ అనుబంధానికి మురిసిపోతున్నారు.
Must Read ;- రంగమ్మత్త ‘పుష్ప’ లో తన పోర్షన్ కంప్లీట్ చేసిందా?











