విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ముచ్చటగా మూడు సినిమాలను ఒకేసారి ట్రాక్ మీద పెట్టాడు. ‘అసురన్’ తమిళ హిట్ మూవీ రీమేక్ వెర్షన్ నారప్ప.. షూటింగ్ పూర్తి చేసుకొని మే 14న విడుదలకు సిద్ధమైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రస్తుతం సెట్స్ మీదున్న ఎఫ్ 3 మూవీ .. ఆగస్ట్ 27న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. అయితే ఈ రెండు సినిమాల షూటింగ్స్ జరుగుతుండగా.. మధ్యలో ఎంటరైన ‘దృశ్యం 2’ చిత్రీకరణను మాత్రం వెంకీ చాలా స్పీడ్ గా పూర్తి చేయడం టాలీవుడ్ లో విశేషంగా మారింది. ఒరిజినల్ వెర్షన్ దర్శకుడు జీతూ జోసేఫే దీన్నీ తెరకెక్కించాడు.
ఇటీవల ఈ సినిమాకి సంబంధించి తన షూట్ ను కంప్లీట్ చేసిన వెంకీ.. ఇప్పుడు సినిమా టాకీ పార్ట్ ను కూడా పూర్తి చేయడం హాట్ టాపిక్ అయింది. మొత్తం 47రోజుల్లో దృశ్యం 2 టాకీ పార్ట్ పూర్తవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి మలయాళ దృశ్యం 2 సినిమా కోసం దర్శకుడు జీతు జోసెఫ్ కేవలం 46 రోజులు టైమ్ తీసుకున్నాడు. అదే దర్శకుడు తెలుగు వెర్షన్ కోసం 47 రోజులు తీసుకోవడం తెలుగు సినిమాల వరకూ అది రికార్డే అని చెప్పాలి.
కరోనా సెకండ్ వేవ్ .. చాలా ఉధృతంగా ఉన్న నేపథ్యంలో నారప్ప, ఎఫ్ 3 సినిమాల్ని ముందుగా నిర్ణయించిన తేదీల్లోనే విడుదల చేస్తారా లేక వాయిదా వేస్తారా అన్న విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ఇక త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు పెట్టి.. దృశ్యం 2 సినిమాకి కూడా విడుదల తేదీని నిర్ణయిస్తారట. మరి ఈ సినిమా ఆ రెండు సినిమాల తర్వాత వస్తుందో లేక .. ముందే విడుదలవుతుందో చూడాలి.
Must Read ;- వెంకీ ‘దృశ్యం 2’ విడుదలయ్యేది థియేటర్స్ లోనా? ఓటీటీలోనా?