ధూళిపాళ్ల కుటుంబం నలుగురికి సాయం చేసే చరిత్ర ఉన్న కుటుంబం అని, మీలాంటి దోపిడీ కుటుంబం కాదు జగన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. సంఘం డైరీ ద్వారా వేలాది మంది పాడి రైతులకు అండగా నిలిచింది ధూళిపాళ్ల కుటుంబమేనని గుర్తు చేశారు. ప్రభుత్వ అసమర్ధతను, దొంగ కేసులను ఆధారాలతో సహా ఎండగట్టినందుకే మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పై జగన్ రెడ్డి కక్ష కట్టారని ఆరోపించారు. 5 సార్లు వరుసగా శాసనసభ్యుడిగా గెలవడం ఒక రికార్డ్ అయితే. చేసిన సేవా కార్యక్రమాలు, అభివృద్ధితో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ధూళిపాళ్ల నరేంద్ర కి ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. అక్రమ కేసులు బనాయించి నరేంద్రను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్ల పేర్కన్నారు. చట్టం ముందు జగన్ రెడ్డి అన్యాయం ఏనాటికి విజయం సాధించలేడని నారా లోకేశ్ అన్నారు.
Must Read ;- సంగం డెయిరీని దెబ్బతీసేందుకే దూళిపాళ్ల అక్రమ అరెస్ట్ : చంద్రబాబునాయుడు











