ఏపీలో ప్రభుత్వ అరాచకాలపై ఎవరైనా ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.ఏపీ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించిన అనేక అంశాల్లో కోర్టులో ఎదురు దెబ్బలు తప్పడం లేదని ఆయన అన్నారు.పరిషత్ ఎన్నికలకు కనీసం నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసినా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పెడచెవిన పెట్టారని ఆయన విమర్శించారు.కొత్త ఎన్నికల కమిషనర్ ను ఆగమేఘాల మీద నియమించి హడావుడిగా ఎన్నికలు మమ అనిపించారని చంద్రబాబు ధ్వజమెత్తారు.
రఘురామరాజును పోలీసులు వేధించారు
ఎంపీ రఘురామరాజును పోలీసులు వేధించారని మెడికల్ ఆసుపత్రి రిపోర్టుల్లో తేలిందని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రభుత్వ కస్టడీలో ఉన్న వారికి ఏపీలో ప్రాణ రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్‌ను పిచ్చివాడిని చేసి చిత్రహింసలకు గురిచేశారని చంద్రబాబు విమర్శించారు.డాక్టర్ సుధాకర్ మరణం ప్రభుత్వ హత్యేనని ఆయన మండిపడ్డారు.
Must Read ;- మత్తు డాక్టర్ సుధాకర్ గుండె పోటుతో మృతి










