బ్రిస్బేన్ టెస్టులో ఆసీస్ క్రీజులో పాతుకుపోతోంది. బోర్డర్-గావస్కర్ సిరీస్ సొంతం చేసుకునేందుకు రూట్ క్లియర్ చేసుకుంటోంది. తొలిరోజు ఐదు వికెట్ల నష్టానికి 274 పరుగులతో ఆధిపత్యం చెలాయిస్తోంది. టాస్ గెలిచిన బ్యాంటింగ్ ఎంచుకున్న ఆసీస్ ను భారత్ ఆదిలోనే దెబ్బతీసింది. కీలక వికెట్లు త్వరగానే తీసి శుభారంభమే చేసింది. కానీ… ఆ తర్వాత ఆసీస్ ను కట్టడి చేయడంలో విఫలమైంది. ఆసీస్ స్టార్ ఆటగాడు లబుషేన్ కు లైఫ్ ఇచ్చి క్షమించరాని తప్పు చేసింది. ఫలితంగా ఆసీస్ తొలిరోజు తనదైన ముద్ర వేసింది.
లబుషేన్ కు లైఫ్ ఇస్తే…
ఆసీస్ స్టార్ ఆటగాడు లబుషేన్.. తనకు లైఫ్ ఇస్తే ఎలా ఉంటుందో మరోసారి నిరూపించాడు. అందివచ్చిన అవకాశాన్ని భారత్ జారవిరవడంతో సెంచరీతో కదం తొక్కాడు లబూషేన్. 37 పరుగుల వద్ద తనకు దక్కిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకున్నారు. ఇది లబుషేన్ కు టెస్టుల్లో ఐదో సెంచరీ. బ్రిస్బేన్ టెస్టులో భాగంగా లబుషేన్ క్యాచ్‌ను రహానే వదిలేశాడు. నవదీప్ సైనీ వేసిన 36 ఓవర్ ఐదో బంతికి గల్లీలోకి స్టైయిట్ ఫార్వర్డ్ క్యాచ్ ఇవ్వగా.. రహానే జారవిడిచాడు. స్టీవ్ స్మిత్ ఔటైన తర్వాత ఓవర్‌లో లబుషేన్ మరోసారి క్యాచ్ ఇచ్చినా అది నేలపాలైంది. కానీ ఆ తర్వాత మళ్లీ లబుషేన్ మరో చాన్స్ ఇచ్చి వెనుదిరిగాడు. కానీ.. అప్పటికే ఆసీస్ కు కావాల్సిన ఆధిక్యాన్ని కట్టబెట్టేశాడు.తొలిరోజు 5 వికెట్లు.. 274 పరుగులు…
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, మయాంక్ అగర్వాల్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైని, మహ్మద్ సిరాజ్, టి. నటరాజన్.ఆస్ట్రేలియా జట్టు: