ప్రభుత్వ భూమిని ఆక్రమించిరని విచారణకు రావాలంటూ పరమ శివుడికే సమన్లు పంపారు రెవెన్యూ అధికారులు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. రాయ్‌గఢ్ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించారంటూ 25వ వార్డుకు చెందిన సుధా రజర్వాడే ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ లో స్థానికంగా ఉన్న శివాలయంతో పాటు మొత్తం 16 మందిని నిందితులుగా పేర్కొన్నారు. దీంతో ఈ అంశంలో నిజానిజాలు తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అక్కడి హైకోర్టు ఆదేశించింది.హైకోర్టు ఆదేశాలతో విచారణ ప్రారంభించిన అధికారులు మొత్తం పది మందికి సమన్లు ఇవ్వగా వారిలో ఆరవ నిందితుడిగా శివుడికి సమన్లు పంపారు.ఈ నెల 25 లోగా శివుడు విచారణకు హాజరు కావాలని , లేని పక్షంలో బలవంతంగా ఆ భూమిని ఖాళీ చేయించడంతో పాటు పది వేల రూపాయల జరిమానా కూడా విధిస్తామని అధికారులు సమన్లలో పేర్కొనడం గమనార్హం. అయితే పిటిషనర్ కోర్టులో వేసిన పిటిషన్ లో శివాలయాన్ని నిందితుడిగా పేర్కొనడంతోనే అధికారులు ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
Must Read:-ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయాలు! కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లుల పరిస్థితి ఏంటి?