అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ మూవీలో అఖిల్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటిస్తుంది. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ మూవీని సమ్మర్ కి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా ఆగింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు కానీ.. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. సమ్మర్ కి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని తెలిసింది.
త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసి.. రిలీజ్ ఎప్పుడు అనేది మరోసారి అఫిషియల్ గా ఎనౌన్స్ చేయనున్నట్టు సమాచారం. ఇక అఖిల్ తదుపరి చిత్రాన్ని స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో చేయనున్నారు. ఈ భారీ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. రీసెంట్ గా పూజా కార్యక్రమాలతో ఈ సినిమాని ప్రారంభించినట్టు తెలిసింది. అయితే.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను సంక్రాంతి తర్వాత స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అఖిల్ సమయం దొరికినప్పుడల్లా ఈ మూవీ కోసం హార్స్ రైడింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.
అనిల్ సుంకర తో పాటు డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యాడు. ప్రస్టేజీయస్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో అఖిల్ ని చాలా స్టైలీష్ గా చూపించబోతున్నాడని తెలిసింది. ఇక హీరోయిన్ విషయానికి వస్తే.. ఇందులో హీరోయిన్ ఎవరు అనేది ఇంకా ఫైనల్ చేయలేదు కానీ.. మిల్కీబ్యూటీ తమన్నా పేరు వినిపిస్తోంది. త్వరలోనే హీరోయిన్ ఎవరు అనేది ఫైనల్ చేసి.. పూర్తి వివరాలను అఫిషియల్ గా ఎనౌన్స్ చేయనున్నారు. ఈ మూవీ పై అక్కినేని అభిమానులు చాలా నమ్మకం పెట్టుకున్నారు. మరి.. సురేందర్ రెడ్డి అఖిల్ కి ఆశించిన విజయాన్ని అందిస్తారేమో చూడాలి.
Must Read ;- ఒక్క వీడియోతో సస్పెన్స్ లో పడేసిన అఖిల్. ఇంతకీ.. ఏంటది..?