lavanya tripati,
అసలే వారు తారలు.. వారి కాంతులు దీపావళి రోజు ఎలా ఉంటాయా అన్న ఆసక్తి సహజం. టపాసులు కాలుస్తూ, కుటుంబ సభ్యులు, మిత్రులతో గడుపుతూ, దీపాలు వెలిగిస్తూ.. ఇలా రకరకాల పోజుల్లో ఫొటోలు దిగి సోషల్ మీడియాని పోస్టులతో ముంచెత్తారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ దాకా ఇదే సందడి. కరోనా వైరస్ కారణంగా ఈసారి దీపావళిని విభిన్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు.

బీ టౌన్ లోనూ ఈ సందడి కనపించింది. అమితాబ్ కుటుంబంతో సందడి చేశారు. కొంతమంది ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపి అంతటితో సరిపెట్టేశారు. ప్రియాంక చోప్రా, శిల్పా శెట్టి, షాహిద్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా తదితరులంతా సోషల్ మీడియాలో సందడి చేశారు. శనివారం రాత్రి నుంచే ఈ సందడి మొదలైంది.

భర్త, గాయకుడు నిక్ జోనాస్‌తో కలిసి లండన్‌లో ఉంటున్న ప్రియాంక తన భర్తను ప్రేమగా దగ్గరకు తీసుకుని మరీ ఫొటోకు పోజిచ్చింది. ‘ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు. మా కుటుంబానికే కాదు మీ అందరికీ ఇది పండగే’ అంటూ ట్వీట్ చేశారు. శిల్పా శెట్టి విషయానికి వస్తే ఆమె లక్ష్మీ దేవికి పూజిస్తున్నట్టు కనిపించింది.
Also Read ;- దీపావళి పర్వదినం లక్ష్మీ స్వరూపం

‘ఇది తమ మొదటి దీపావళి’ అంటూ ఆమె పేర్కొంది. ఇక ఖల్‌నాయక్ విషయానికి వద్దాం. సంజూ బాబా స్నేహశీలి. క్యాన్సర్ జయించి ఇటీవలే బయటపడ్డారు. తన సినిమా షూటింగ్‌లతో బిజీ బిజీగా ఉన్నా తన కుటుంబంతో కలిసి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు.

సర్ ప్రైజ్ ఏమిటంటే ఈ దీపావళికి సంజయ్‌దత్ ఇంటికి ఓ ప్రత్యేక అతిథి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆయనే మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్. తన స్నేహితుడు సంజయ్ దత్ ఆహ్వానం మేరకు వారి ఇంటికి వెళ్లారట. ఇలా కలిసి దీపావళిని జరుపుకోవడం ఆనందంగా ఉందని మోహన్ లాల్ అన్నారు.
సంజయ్‌దత్ కుటుంబంతో తను ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు మోహన్ లాల్. తెలుగులో హీరో చిరంజీవి తన గురువు దర్శకుడు కె. విశ్వనాథ్ ఆశీస్సులు తీసుకున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ కూడా తన కుటుంబంతో కలిసి దీపావళి పండుగ జరుపుకున్నారు.
హీరో రాజశేఖర్ కుటుంబం కూడా ఈ పండుగ జరుపుకుని ఫొటో షేర్ చేశారు. నటి పూజా హెగ్డే తన కుటుంబ సభ్యులతో కలిసి ఫొటో దిగి షేర్ చేసింది. లావణ్య త్రిపాఠి తన కుటుంబ సభ్యులతో ఫొటో షేర్ చేసింది. ఇలా ఎందరో తారలు అందరూ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.
ప్రిన్స్ ఏం చేశాడో తెలుసా?
ఊరందరికీ ఓ దారి అయితే ప్రిన్స్ మహేష్ ది మరో దారి. ఈ దీపావళి రోజున తనకు నచ్చిన, తను మెచ్చిన దర్శకులందరికీ మంచి దీపావళి గిఫ్ట్ ను పంపించేశాడు. ‘ఈ పండగ రోజున అందరం సంతోషంగా గడిపేద్దాం. మా కుటుంబం తరఫున మీకు మా ప్రేమాభిమానాలు’ అని పేర్కొన్న గ్రీటింగ్ కార్డుతో పాటు స్వీట్లు కూడా పంపించాడు. ఒక్క దర్శకులే కాదు అందులో చాలా మంది సెలబ్రిటీలు కూడా ఉన్నారు. వారు వాటిని సోషల్ మీడియా ద్వార షేర్ చేసి మహేష్ చూపిన అభిమానాన్ని చాటుకున్నారు. ఆ గిఫ్ట్ ప్యాక్ లో ఇంకా ఏమేం ఉన్నాయ్ మరి.
రౌడీ హీరో సకుటుుంబ సమేతం..
అందరికీ రౌడీ హీరోగా సుపరిచితుడైన విజయ్ దేవరకొండ దీపావళిని పూర్తిగా కుటుంబానికే కేటాయించారు. కుటుంబమంతా ఒక్కచోట చేరి పండుగ చేసుకోవడం చాలా సంతోషం కలిగిస్తుందని ట్వీట్ చేశాడు. తను ఈరోజు వాళ్ల అమ్మకు ఇంటి పనుల్లో, వంట పనుల్లో సాయం చేశాడట. ఆ ఫొటోలను కూడా ట్విట్టర్ లో షేర్ చేశాడు. అమ్మ, నాన్న, తమ్ముడు, ఓ కుక్క.. ఇదండీ విజయ్ దేవరకొండ దీపావళి సంబరం.

lavanya tripati,
Also Read ;- దీపావళికి ఓటీటీలో పేలబోతున్న అక్షయ్ కుమార్ ‘లక్ష్మీ బాంబ్’