నటసింహ నందమూరి బాలకృష్ణ రేపు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన అభిమానులకు ఒకరోజు ముందుగానే గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ మూవీ ‘అఖండ’ సినిమాకి సంబంధించిన ఒక రోరింగ్ లుక్ ను ఈ రోజు రివీల్ చేశారు. బాలయ్య ఇందులో నెవర్ బిఫోర్ అన్న రీతిలో కనిపిస్తున్నారు. సింహ, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్టైన నేపథ్యంలో ఈ సినిమామీద భారీ అంచనాలు నెలకొన్నాయి.
బాలయ్య కెరీర్ లో చాలా ప్రత్యేకమైన ఈ సినిమా కోసం టీమ్ చాలా కష్టపడుతోంది. మొట్టమొదటి సారిగా ఆయన ‘అఘోరా’ గెటప్ లో కనిపించబోతున్నారనే సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలై.. సరికొత్త రికార్డులు సెట్ చేసింది. ద్వారాకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీంద్రరెడ్డి నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వల్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నాడు.
రెండె డిఫరెంట్ గెటప్స్ లో బాలయ్య కనిపిస్తున్న ‘అఖండ’ సినిమా ను దసరాకి విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. షూటింగ్ ఆగిపోగా.. విడుదల తేదీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అనంతరం అఖండ సినిమా తిరిగి సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. బ్యాలెన్స్ షూట్ కోసం దర్శకుడు బోయపాటి ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నారు.
Must Read ;- అభిమానులకు బాలయ్య ‘అఖండ’మైన పుట్టినరోజు కానుక