ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో బాలయ్య, బోయపాటి ‘అఖండ’ ఒకటి. సింహ, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టరైన నేపథ్యంలో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు.. అఖండ టీజర్ .. కొత్త రికార్డులు నెలకొల్పడం కూడా ఈ సినిమా అత్యధిక క్రేజ్ కు కారణమైంది.
కరోనా సెకండ్ వేవ్ లేకపోయి ఉంటే.. ‘అఖండ’ సినిమా మరో మూడు రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయాలి. ఇప్పుడు సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోవడమే కాకుండా.. విడుదల తేదీని కూడా మార్చాల్సి వచ్చింది. ఇక ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్టేడ్ నందమూరి అభిమానుల్ని ఖుషీ చేస్తోంది. అఖండ సినిమాకి అదిరిపోయే రేంజ్ లో ప్రీరిలీజ్ బిజినెస్ దక్కిందని సమాచారం. బాలయ్య సినిమాల్లోకెల్లా ఇది అత్యధికం.
తాజా సమాచారం ప్రకారం అఖండ సినిమాకి థియేట్రికల్ రైట్స్ డిజిటల్ రైట్స్ కలిపి దాదాపు రూ. 80 నుంచి 90 కోట్లు వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. ఏ మాత్రం సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా.. ‘అఖండ’ సినిమా నెలకొల్పే రికార్డులకు అంతే ఉండదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎర్లియర్ గా బాలయ్య రూలర్ సినిమా రిజల్ట్ తోనూ, బోయపాటి వినయవిధేయ రామ సినిమా రిజల్ట్ తోనూ నిరాశ చెందారు. అలాంటి ఈ ఇద్దరు ఇప్పుడు అఖండ తో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అందుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు.
Must Read ;- అభిమానులకు బాలయ్య ‘అఖండ’మైన పుట్టినరోజు కానుక