మాజీ మంత్రి, ఎమ్మెల్సీ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో వైసీపీ నేతలకు ఇప్పటికే అర్థమయ్యే ఉంటుందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ప్రజా సమస్యలపైనే తనదైన శైలి దూకుడు చూపుతున్న లోకేశ్.. ఇక తమ కుటుంబంపై విమర్శలు సంధిస్తే చూస్తూ కూర్చోరు కదా. అందుకే కాబోలు.. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి లక్ష్యంగా నారా లోకేశ్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. సజ్జలను ఏకంగా బ్రోకర్ గా అభివర్ణిస్తూ లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా ఎవరిపై ఎన్నెన్నికేసులు ఉన్నాయో చూసుకోండి అంటూ సెటైర్లు వేయడంతో పాటుగా ఏ విషయంపై అయినా తాను విచారణకు సిద్ధమని, మరీ మీరు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. ట్విట్టర్ వేదికగా లోకేశ్ సంధించిన ఈ సవాల్ ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.
లోకేశ్ ఏమన్నారంటే..?
ఈ సందర్భంగా ఆదిలోనే సజ్జలపై ఘాటు కామెంట్లు చేసిన లోకేశ్.. సీఎం జగన్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తదితరులను ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ ట్వీట్ ఎలా సాగిందంటే.. ‘‘ డ్రగ్స్ బాస్ ఎవరు అంటే బ్రోకర్ సజ్జల ఎందుకు భుజాలు తడుముకున్నారు. మా నాన్న మారిషస్, నేను దుబాయి అంటూ బొంబాయి కబుర్లు మాని, డ్రగ్స్ మాఫియా కింగ్ పిన్ వైయస్ జగన్ బినామీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై విచారణ జరిపించండి. 40 ఏళ్ల మా నాన్న రాజకీయ జీవితంలో ఒక కేసు అయినా ఉందాఝ? మీ రెండున్నరేళ్ల పాలనలో నాపై కక్ష కట్టి మరీ పెట్టిన ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ కేసు తప్పించి, మీరు ఆరోపించిన వాటిలో ఒక్క రూపాయి అయినా అవినీతి అక్రమాలు నిరూపించగలిగారా? సీబీఐ, ఈడీ, మనీలాండరింగ్, ఐటీ కేసులతో ఆర్థిక ఉగ్రవాది అయిన జగన్ రెడ్డి ఇప్పుడు తన నేర సామ్రాజ్యాన్ని డ్రగ్స్ దందా వరకు విస్తరించారు. 72వేల కోట్ల హెరాయిన్ దిగుమతిపై డి ఆర్ ఐ కేసులోనూ జగన్ రెడ్డి ఏ 1. ప్రజల ఆరోగ్యం కాపాడే పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి వ్యాపారం మాది. జనం ప్రాణాలు తీసే.. లక్షల కుటుంబాలకు విషాదాన్ని మిగిల్చిన హెరాయిన్, గంజాయి, ప్రాణాంతక మద్యం మాఫియాలు మీవి. ఎస్.. నేను దుబాయిలో నా కుటుంబ సభ్యులతో ఉన్నా. నా పర్యటన పైన మీ డ్రగ్ బిగ్ బాస్ బినామీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సీక్రెట్ గా వెళ్ళిన డ్రగ్స్ హెవెన్ ఐవరీ కోస్ట్ టూర్ పైన కేంద్ర సంస్థల దర్యాప్తుకి సిద్ధమా? బ్రోకర్ సజ్జలా !! అక్టోబరు 1న ఛాలెంజ్ చేసి మరీ డ్రగ్స్ పరీక్షలకు టిడిపి యువ నేతల బృందం వస్తే తోకముడిచిన మీ వైసీపీ నేతలే డ్రగ్స్ మాఫియా సూత్రధారులు, వాడకందారులు అని తేలిపోయింది. సజ్జల రామకృష్ణారెడ్డి తీరు డ్రగ్స్ దొంగే.. దొంగా .. దొంగా అని అరిచినట్లు ఉంది’’ అని లోకేష్ ఓ రేంజిలో విరుచుకుపడ్డారు.
Must Read ;- మరీ ఇంత దిగజారుడుతనమా?
సజ్జలకు నీట మాట వచ్చేనా?
ఇటీవలే మీడియా ముందుకు వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి డ్రగ్స్ స్మగ్లింగ్ మొత్తం టీడీపీ నేతలదేననే కోణంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా టీడీపీ అధినేత చంద్రబాబును, లోకేశ్ ను టార్గెట్ చేసి ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారాన్ని వైసీపీ నేతలకు ఎలా లింక్ పెట్టాలా అని చూస్తున్నారని, దొంగే దొంగ అన్నట్లుగా వ్యవహారం ఉందని, తెలుగుదేశం పార్టీ నేతలకే ఇలాంటి దందాలపై గట్టి పట్టు ఉందని సజ్జల ఎటాక్ చేశారు. టీడీపీ వాళ్ళు డ్రగ్స్ బిజినెస్ లోకి దిగారేమో అన్న అనుమానం కలుగుతోందని సజ్జల అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తాను సంపాదించిన డబ్బులు డ్రగ్స్ వ్యాపారంలోకి మళ్లించారని, రాజకీయంగా ఎదుగుదల లేకపోవడంతో చంద్రబాబు కుటుంబం డ్రగ్స్ బిజినెస్ లోకి దిగిందని ఆరోపించారు. దుబాయ్ లో నారా లోకేశ్ కు ఏం పని అని ప్రశ్నించారు. చంద్రబాబు హాంకాంగ్, సింగపూర్, మాల్దీవులు, మారిషస్ వెళ్లారని డ్రగ్స్ కు లింక్ పెట్టి విమర్శలు చేశారు. సజ్జల వ్యాఖ్యలకు లోకేష్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఈ వ్యాఖ్యలన్నింటికీ ఒకే ట్వీట్ లో రివర్స్ అటాక్ చేసిన లోకేశ్.. సజ్జలకు నోట మాట రాకుండా చేశారనే చెప్పాలి. ఎందుకంటే.. ఏ విచారణకు అయినా తాము సిద్ధమని, మరి మీరు ఆ విచారణలకు సిద్ధమా? అని లోకేశ్ ప్రశ్నించారు. లోకేశ్ రివర్స్ అటాక్‌తో సజ్జలతో పాటు మరే ఇతర వైసీపీ నేత కూడా మారు మాట్లాడే అవకాశమే లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- ‘ఆత్మ సాక్షి’గా వైసీపీ గల్లంతే!