పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’ .. ఏప్రిల్ 9న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ రావడంతో .. సినిమా మీద పాజిటివ్ బజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో ‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ వేడుకను భారీ ఎత్తున నిర్వహించాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేశారు. తెలంగాణ పోలీసులను పర్మిషన్ కోరారు. అయితే వారి నుంచి అనుమతులు లభిస్తాయనే కాన్ఫిడెన్స్ తో దిల్ రాజు .. వేడుకకి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కానీ అనూహ్యంగా పోలీసుల నుంచి అనుమతి లభించలేదు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లాంటి పబ్లిక్ ఫంక్షన్ ను నిర్వహించకపోవడమే మంచిదనే నిర్ణయానికి పోలీసులు వచ్చారు.
Vakeel Saab Pre Release Event :
ఈవెంట్ కు దాదాపు 5వేల నుంచి 6వేల వరకూ జనం వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి.. ఆ సమయంలో సామాజిక దూరం సాధ్యం కాదు కాబట్టి.. తెలంగాణా పోలీసులు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నో చెప్పారు. ఈ సందర్భంగా పాస్ చేసిన జీవో కాపీని పోలీసులు విడుదల చేశారు. కరోనా వైరస్ కారణంగానే .. ఏప్రిల్ 30 వరకూ ఇలాంటి పబ్లిక్ ఈవెంట్స్ మీద నిషేధం విధించినట్టుగా కూడా చెప్పారు. అయినప్పటికీ.. తక్కువ గేదరింగ్ తో ఈవెంట్ నిర్వహించేలా .. దిల్ రాజు పోలీసుల్ని మరోసారి కోరనున్నారని అంటున్నారు. అయితే.. ఎంత తక్కువ మెంబర్స్ ఉన్నప్పటికీ అది పబ్లిక్ గేదరింగే అవుతుంది కాబట్టి.. పోలీసులు పర్మిషన్ కు నో చెప్పే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే పవర్ స్టార్ అభిమానులకు నిరాశ తప్పదన్నమాట.
Must Read ;- ట్రైలర్ టాక్ : నట విశ్వరూపం చూపించిన ‘వకీల్ సాబ్’