బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త హీరోగా బిడియపడుతూ ఎంట్రీ ఇవ్వలేదు. మాస్ హీరో రేంజ్ లోనే స్క్రీన్ పైకి వచ్చాడు. కుర్రాడిలో విషయం విస్తృతంగానే ఉందనిపించుకున్నాడు. ‘అల్లుడు శీను’ దగ్గర నుంచి ‘అల్లుడు అదుర్స్‘ వరకూ ఆయన చేసిన సినిమాలు మాస్ కంటెంట్ తోనే అలరిస్తూ వచ్చాయి. ఇప్పుడు కూడా ఆయన అదే పద్ధతిని కొనసాగిస్తూ మరో ప్రాజెక్టును లైన్లో పెట్టాడు. ఆ సినిమా పేరే .. ‘స్టూవర్ట్ పురం దొంగ’. తాజాగా టైటిల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.
1970లలో నడిచే ఈ కథను ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించనుంది. బెల్లంకొండ సురేశ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాతో, కెఎస్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మణిశర్మ రీ రికార్డింగ్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని చెబుతున్నారు. త్వరలోనే ఇతర నటీనటుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేసి, ఆ వివరాలను తెలియజేస్తారట. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను పట్టాలెక్కించే దిశగా పనులు జరుగుతున్నాయి.
ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ ‘ఛత్రపతి‘ హిందీ రీమేక్ షూటింగులో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ కి పరిచయమవుతున్నాడు. వీవీ వినాయక్ దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో, బెల్లంకొండ శ్రీనివాస్ సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడు. అందుకోసం ఆయన చాలా గట్టిగానే కసరత్తు చేశాడనే విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగు పూర్తి కాగానే ఆయన ‘స్టూవర్ట్ పురం దొంగ’ ప్రాజెక్టు పైకి రానున్నాడని అంటున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Must Read ;- లక్ష్య నుంచి రొమాంటిక్ పోస్టర్!