Venkatesh’s Narappa Movie Trailer Review :
విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం నారప్ప. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఇది తమిళ్ లో ధనుష్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీకి రీమేక్. ఇందులో వెంకీ సరసన ప్రియమణి నటించింది. సురేష్ బాబు, కలైఫులి ఎస్ థాను సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే.. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కి సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు అని ప్రకటించినప్పుడు.. రాంగ్ ఛాయిస్ అనుకున్నారు. చాలా మంది వెంకీకి ఫోన్ చేసి శ్రీకాంత్ అడ్డాల కరెక్ట్ కాదని చెప్పారట. అయితే.. ఎప్పుడైతే నారప్ప ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారో అప్పుడు ఆ పాత్రకు వెంకీ కరెక్ట్ సెట్ అయ్యాడు అంటూ సినిమా పై పాజిటివ్ టాక్ వచ్చింది.
ఇక నారప్ప చిత్రాన్ని థియేటర్లో రిలీజ్ చేస్తారనుకుంటే.. ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 20న అమెజాన్ ప్రైమ్ లో నారప్ప విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ రోజు నారప్ప ట్రైలర్ ను విడుదల చేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ఓల్డ్ గెటప్ లో వెంకీ కోపంతో శత్రువును వెంటాడే సన్నివేశంతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది.
ఇందులో చూపించిన సన్నివేశాలు సినిమా పై హైప్ పెంచేశాయి. వెంకీ ఓల్డ్ గెటప్, యంగ్ గెటప్ లలో కనిపించారు. వాళ్లను ఎదిరించడానికి అది ఒక్కటే దారి కాదు. మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ చదువును ఒక్కటి మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు చిన్నప్ప అంటూ వెంకటేష్ చెప్పిన డైలాగ్ విశేషంగా ఆకట్టుకుంటుంది.
ఇంకా చెప్పాలంటే.. వెంకీ నట విశ్వరూపం చూపించారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరింది. ప్రకాశ్‌రాజ్, మురళీశర్మ, కార్తిక్ రత్నం కీలకపాత్రలు పోషించారు. ఈ నెల 20న ఓటీటీలో రానున్న నారప్ప ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి.
Must Read ;- నారప్ప, దృశ్యం 2 సినిమాలను ఎంతకు అమ్మారు?











