ఆది సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ.. తొలి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ సాధించిన మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్. ఆది తర్వాత చెన్నకేశరెడ్డి, దిల్, ఠాగూర్, సాంబ, బన్నీ, లక్ష్మీ, యోగి, కృష్ణ, అదుర్స్.. ఇలా వరుసగా విజయాలు సాధించి డైనమిక్ డైరెక్టర్ అనిపించుకున్నారు. వినాయక్ సినిమా అనగానే.. ఫ్యాక్షన్, టాటా సుమోలు గాల్లో ఎగరడం, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ గుర్తుకొస్తాయి. అలాగే హీరోయిజంని ఒక రేంజ్ లో ఎలివేట్ చేసే దర్శకులలో వినాయక్ ఒకరు. చిరంంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ సాధించారు. ఆతర్వాత వినాయక్ ఇంటిలిజెంట్ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఈ సినిమా బాక్సీఫీస్ దగ్గర బోల్తాపడింది. దీంతో వినాయక్ కెరీర్ లో కాస్త వెనుకబడపడ్డారు. చిరుతో లూసీఫర్ రీమేక్ తెరకెక్కించాలి అనుకున్నారు కానీ.. కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో ఛత్రపతి బాలీవుడ్ రీమేక్ ని తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే… తాజాగా ఓ ఇంటర్ వ్యూలో వినాయక్ టాలీవుడ్ స్టార్స్ పై ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఇంతకీ వినాయక్ ఏం చెప్పారంటే.. టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో వచ్చే చిత్రాలని ప్రస్తుతం ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు అని వినాయక్ అన్నారు. మహేష్, పవన్ కళ్యాణ్ లలో ఒకరితో సినిమా తీయాల్సి వస్తే ఎవరిని ఎంచుకుంటారు అని ప్రశ్నించగా.. వినాయక్ పవన్ కళ్యాణ్ అని సమాధానం ఇచ్చారు.
ఎందుకంటే.. పవన్ తో నాకు మంచి రాపో ఉంది. మహేష్ తో మాత్రం తనకు అంత రాపో లేదని, తాము కలుసుకున్నది చాలా తక్కువ అని అన్నారు. మరి పవన్ తో సినిమా ఎప్పుడు ఉంటుంది అని ప్రశ్నించగా.. అది ఆయన డిసైడ్ చేయాల్సిన విషయం. పవన్, చిరంజీవి గారి లాంటి స్టార్స్ ని గమనిస్తే.. ఈ టైం లో తాము యాక్షన్ మూవీ చేయాలా లేక పొలిటికల్ మూవీ చేయాలా అనేది వారు డిసైడ్ అవుతారని వినాయక్ అన్నారు. ఇక చిరంజీవి, బాలయ్య ఇద్దరిలో ఒకరితో సినిమా చేయాల్సి వస్తే ఎవర్ని ఎంచుకుంటారు అని ప్రశ్నించగా., తనకు ఇద్దరూ మంచి ఆప్తులు అని ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేను అని అన్నారు. ఇక పవన్, రానా నటిస్తున్న అయ్యప్పన్ కోషియం రీమేక్ లో తాను చిన్న పాత్ర చేస్తున్న విషయాన్ని వినాయక్ ధృవీకరించారు. మరి.. భవిష్యత్ లో పవన్ తో వినాయక్ సినిమా చేస్తారేమో చూడాలి.
Must Read ;- ‘స్టేట్ కి ఒక్కడు’.. పవన్ సినిమా పేరు ఇదేనా?











